ETV Bharat / bharat

పాక్​ సైన్యం కాల్పులు- భారత జవాను మృతి - ceasefire news

సరిహద్దుల్లో పాక్​ దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉంది. జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్​లో పాక్​ సైన్యం కాల్పులకు పాల్పడింది. ఈ ఘటనలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు.

Army JCO killed in firing
పాక్​ సైన్యం కాల్పులు
author img

By

Published : Aug 30, 2020, 1:41 PM IST

సరిహద్దు వెంట పాకిస్థాన్​ మరోమారు కాల్పులకు పాల్పడింది. జమ్ముకశ్మీర్​ రాజౌరీ జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాక్​ సైన్యం. దాయాది దాష్టీకానికి భారత సైన్యంలోని జాయింట్​​ కమిషన్డ్​ అధికారి​ (జేసీఓ) అమరుడయ్యాడు.

నియంత్రణ రేఖ వెంబడి నౌషేరా సెక్టార్​లో అనుమానాస్పద కదలికలను గుర్తించిన క్రమంలో కాల్పులకు పాల్పడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో జేసీఓకు తూటా తగలగా.. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే క్రమంలో ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.

పాక్​ సైన్యం దుశ్చర్యలను భారత బలగాలు సమర్థంగా తిప్పి కొడుతున్నట్లు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: అమర జవాన్​ ప్రశాంత్​ శర్మకు ఘన నివాళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.