కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు మరో అడుగు ముందుకేసింది భారత సైన్యం. ఆర్మీకి చెందిన 8500 వైద్య సిబ్బంది వైరస్‌కు చికిత్స అందించేందుకు కేటాయించింది.
వైరస్‌పై పోరులో సైన్యం పాత్రపై త్రివిధ దళాధిపతులతో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశం వేదికగా సైన్యానికి చెందిన వైద్య సిబ్బందిని కరోనా సేవల కోసం వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వైరస్‌పై పోరాడేందుకు అదనంగా వైద్యులు, సిబ్బంది అందుబాటులోకి రానున్నారు.
మేము సైతం.. ఎన్సీసీ
25,000 మంది ఎన్సీసీ వలంటీర్లను సమీకరిస్తున్నట్లు తెలిపారు అధికారులు. కరోనాపై సేవలో వీరిని వినియోగించనున్నట్లు చెప్పారు. సైన్యానికి చెందిన 9000 పడకలను సైతం బాధితుల కోసం సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
సమష్టి కృషితో..
దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుందని.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర మంత్రిత్వ శాఖలు సమన్వయంతో, రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని సమావేశం వేదికగా సూచించారు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్.
ఇదీ చూడండి: తమిళనాడులో ఒక్కరోజే 110 కరోనా కేసులు నమోదు