ట్రిపుల్ తలాక్ చట్టం తీసుకురావటంలో కీలకపాత్ర పోషించిన షయారా బానోకు ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా కమిషన్లో ఉపాధ్యక్షురాలిగా చోటు కల్పించింది. ఆమెతోపాటు మరో ముగ్గురు మహిళలకూ అవకాశం దక్కింది. 'నవరాత్రి శుభ దినాన రాష్ట్ర మహిళలకు ఉత్తరాఖండ్ సీఎం ఇచ్చే బహుమతి ఇది' అని సీఎం కార్యాలయ మీడియా ప్రతినిధి దర్శన్ సింగ్ రావత్ తెలిపారు.
ఉపాధ్యక్షులు వీరే..
- షయారా బానో - ఉద్దమ్ సింగ్ నగర్ జిల్లా , ఉత్తరాఖండ్
- జ్యోతీషా , రాణీఖేట్- అల్మోరా జిల్లా , ఉత్తరాఖండ్
- పుష్ప పాసవాన్- చమోలీ జిల్లా , ఉత్తరాఖండ్
2014లో ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టులో పోరాడిన మొదటి ముస్లిం మహిళగా షయానా బానోకు గుర్తింపు ఉంది. పదిరోజుల క్రితం ఆమె ఉత్తరాఖండ్ భాజపా అధ్యక్షుడు బన్సీధర్ భగత్ సమక్షంలో పార్టీలో చేరారు.