వెలుతురులో వికసించే కుసుమాలు
ఈ జాతి చామంతి పూలు చైనాలో ఎక్కువగా పూస్తాయి. భారతదేశంలో కోల్‌కతాలో మాత్రమే కనిపిస్తాయి. చూడచక్కని వర్ణాలతో వేడుక ఏదైనా అలంకరణకు ఈ పూలు చక్కటి ఆభరణంగా అబ్బుతాయి. ఒక్క పూజాతిలోనే తీరొక్క పూలు ఇమిడి ఉన్నాయి. ప్రస్తుతం ఈ పూలలో ఇక్కడ 8 రకాలు దొరుకుతాయి. 12 విభిన్న రంగులున్నాయి. ఒక్కో పువ్వు ధర 3/- రూపాయల నుంచి 10/- రూపాయల వరకు ఉంటుంది.
అయితే ఈ పంటకు 24 గంటల విద్యుత్తు కావాలి. వెలుతురు బాగా ఉంటేనే దిగుబడి బాగుంటుంది. రాత్రుళ్లు విద్యుత్ దీపాల వెలుతురులతో ఆ పూల కాంతులు పోటీపడి మరీ వికసిస్తాయి. ఇలా సతీశ్‌కు ఎక్కువ మొత్తంలో ఆదాయం చేకూరుస్తాయి.
విద్యుత్తుతో పంట సాగు గురించి తెలుసుకుని, ఆచరిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు ఈ ఇంజనీర్ రైతు.
" నా కుమారుడు బీటెక్ పూర్తి చేశాడు. యూపీఎస్సీ పరీక్షలోనూ అర్హత సాధించాడు. కానీ, కొత్తగా ఏదైనా చేయాలని ఇలా పూల సాగు ప్రారంభించాడు. కొందరు ఉద్యోగం లేదని నిరాశ చెందుతారు. కానీ ఆలోచిస్తే చేయలేని పనంటూ లేదని నా కుమారుడు నిరూపించాడు. ఈ పూదోటకు ప్రభుత్వం ప్రోత్సాహాన్నందిస్తే బాగుంటుంది."
-సతీశ్ తండ్రి
పుష్పాలతో లక్షల్లో ఆదాయం
సతీష్ చైనీస్ వ్యవసాయాన్ని భారతదేశంలో ప్రయోగించి విజయవంతమయ్యాడు. తనకున్న ఒక ఎకరం పొలాన్ని ఆద్భుతంగా సాగు చేస్తున్నాడు.
"మైసూర్లో ఇలాంటి పూదోటను తొలిసారిగా మేమే సాగు చేస్తున్నాం. ఈ పంట సాగుకు లైట్లు, కూలీలు అన్నీ కలిపి ఏడాదికి దాదాపు 6 లక్షల రూపాయల ఖర్చు వస్తుంది. ఆదాయం సుమారు 15 లక్షల నుంచి 18 లక్షల మధ్య ఉంటుంది. సీజన్, డిమాండ్‌ను బట్టి ఆదాయం వస్తుంది. కాబట్టి యువకులు వ్యవసాయాన్ని ఇష్టంగా మార్చుకుని కష్టపడాలి."
- సతీశ్
ఇదీ చూడండి:ఫేస్బుక్ ప్రేమ: ఒక్కటైన జపాన్ వధువు, తమిళ వరుడు