ETV Bharat / bharat

సూపర్ సైక్లోన్​గా మారుతున్న అంపన్​ - 13 కి.మీ వేగంతో పయనిస్తున్న అంపన్

సోమవారం సాయంత్రం నాటికి అంపన్ తుపాన్... సూపర్ సైక్లోన్​గా మారే అవకాశముందని భారత వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం 13 కి.మీ వేగంతో కదులుతున్న ఈ అంపన్​.. మే 20 నాటికి బంగాల్​లోని దిఘా, బంగ్లాదేశ్​లోని హతియా ద్వీపాల మధ్య 185 కి.మీ వేగంతో తీరం దాటే అవకాశముందని అంచనా వేసింది.

Amphan cyclone
సూపర్ సైక్లోన్​గా మారుతున్న అంపన్​
author img

By

Published : May 18, 2020, 12:02 PM IST

Updated : May 18, 2020, 12:12 PM IST

అంపన్ తుపాను సోమవారం సాయంత్రానికి సూపర్ సైక్లోన్​గా మారే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్​డీ) హెచ్చరించింది. మే 20 మధ్యాహ్నం లేదా సాయంత్రానికి బంగాల్​లోని దిఘా, బంగ్లాదేశ్​లోని హతియా ద్వీపాల మధ్య 185 కి.మీ వేగంతో తీరం దాటే అవకాశముందని అంచనా వేసింది.

ఒడిశా పారదీప్​కు దక్షిణాన 790 కి.మీ, బంగాల్​లోని దిఘాకు నైరుతి దిశగా 940 కి.మీ, బంగ్లాదేశ్​ ఖేపుపారాకు 1060 కి.మీ దూరంలో అంపన్ కేంద్రీకృతమై ఉందని ఐఎమ్​డీ పేర్కొంది. ప్రస్తుతం ఇది బంగాల్ తీరం వెంబడి దక్షిణ-నైరుతి దిశగా 13 కి.మీ వేగంతో పయనిస్తోందని తెలిపింది.

భారీ నష్టం!

తుపాన్​ ధాటికి బంగాల్​, ఒడిశా తీరం వెంబడి తీవ్రమైన గాలులతో, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 11 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఒడిశా ప్రభుత్వం సిద్ధం కావాలని సూచించింది.

జాతీయ విపత్తు నిర్వహణ కమిటి (ఎన్​సీఎమ్​సీ) తుపాను ధాటికి దెబ్బతినే అవకాశమున్న ఒడిశా, బంగాల్​కు తక్షణ సాయం అందించడానికి సంసిద్ధమైంది.

మోదీ ఉన్నతస్థాయి సమీక్ష...

తుపాను ప్రభావం, పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని నేతృత్వంలో సాయంత్రం 4 గంటలకు ఉన్నతస్థాయి సమావేశం జరగనున్నట్లు హోంమంత్రి అమిత్​ షా తెలిపారు.

ఇదీ చూడండి: కరోనా రికార్డ్​: 24 గంటల్లో 157 మరణాలు, 5242 కేసులు

Last Updated : May 18, 2020, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.