ETV Bharat / bharat

త్వరలో బంగాల్​ పర్యటనకు అమిత్​ షా! - భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా

ఈ నెల 19,20 తేదీల్లో కేంద్ర హోంమంత్రి, భాజపా సీనియర్​ నేత అమిత్​ షా బంగాల్​లో పర్యటించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధంపై షా సమీక్షించే అవకాశముంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్​పై రైళ్ల దాడి జరిగిన నేపథ్యంలో షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

Amit Shah to visit West Bengal as BJP, TMC cross swords after attack on Nadda's convoy
త్వరలో బంగాల్​ పర్యటనకు అమిత్​ షా!
author img

By

Published : Dec 11, 2020, 11:23 AM IST

Updated : Dec 11, 2020, 1:43 PM IST

భాజపా సీనియర్​ నేత, కేంద్రమంత్రి అమిత్​ షా.. ఈ నెలలో బంగాల్​లో పర్యటించనున్నట్టు సమాచారం. సరైన తేదీలను భాజపా వెల్లడించనప్పటికీ.. ఈ నెల 19,20న షా పర్యటన ఉంటుందని తెలుస్తోంది. గురువారం.. దక్షిణ 24 పరగణాల జిల్లాలో భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్​పై రైళ్ల దాడి జరిగిన నేపథ్యంలో.. షా పర్యటనపై వచ్చిన వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.

బంగాల్​లో 2021 మేలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో రాష్ట్రంలో పర్యటించి.. ఎన్నికలు భాజపా సన్నద్ధతను షా సమీక్షించనున్నారని సమాచారం. ఇప్పటికే ఈ నెలలో ఒకసారి బంగాల్​లో పర్యటించారు భాజపా మాజీ అధ్యక్షుడు.

మరోవైపు రెండు రోజుల పర్యటన కోసం శనివారం బంగాల్​కు వెళ్లనున్నారు ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​ మోహన్​ భాగవత్​. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. భాజపా వర్గాల సమాచారం మేరకు.. భాజపా బంగాల్​ అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​తో పాటు ఇతర నేతలతోనూ భేటీకానున్నారు ఆర్​ఎస్​ఎస్​ చీఫ్​. అయితే ఇవి కేవలం సంస్థాగత సమావేశాలేనని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

గవర్నర్​ నివేదిక..

నడ్డా కన్వాయ్​పై రాళ్ల దాడి వ్యవహారంపై బంగాల్​ గవర్నర్​.. కేంద్ర హోంశాఖకు నివేదిక పంపినట్టు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే ఈ నివేదిక కోసం హోంశాఖ ఆదేశించింది. నడ్డాకు రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది.

మరోవైపు రాళ్ల దాడికి నిరసనగా ముంబయిలో నిరసన చేపట్టారు భాజపా కార్యకర్తలు. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆమె ఫొటోలకు నల్లరంగు పూశారు.

ఇదీ చూడండి- అసహనానికి పర్యాయపదం మమత: నడ్డా

Last Updated : Dec 11, 2020, 1:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.