ETV Bharat / bharat

సిక్కుల కోసం తీసుకున్న నిర్ణయాలపై 2 కోట్ల మెయిళ్లు

సిక్కుల సంక్షేమం కోసం ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ వినియోగదారులకు రెండు కోట్ల మెయిళ్లను పంపించినట్లు ఐఆర్​సీటీసీ తెలిపింది. వ్యవసాయ చట్టాల వల్ల కలిగే లాభాలను వివరించినట్లు పేర్కొంది. దీంతో పాటు ప్రజాసంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలను మెయిల్​లో ప్రస్తావించినట్లు స్పష్టం చేసింది.

IRCTC
సిక్కుల కోసం తీసుకున్న నిర్ణయాలపై రెండు కోట్ల మెయిళ్లు
author img

By

Published : Dec 13, 2020, 10:30 PM IST

రైతుల ఆందోళనల నేపథ్యంలో సిక్కుల కోసం ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలు వివరిస్తూ వినియోగదారులకు దాదాపు రెండు కోట్ల ఈ మెయిళ్లను ఐఆర్​సీటీసీ పంపింది. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు కలిగే లాభాలతో పాటు ప్రజా సంక్షేమం కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ వినియోగదారులకు మెయిల్‌ చేసింది. అక్టోబర్‌ 12 నుంచి డిసెంబర్ 12 మధ్య వినియోగదారులకు ఈ... మెయిళ్లు పంపినట్లు అధికారులు తెలిపారు.

అయితే సిక్కులకు మాత్రమే ఈ సందేశాలు పంపినట్లు వస్తున్న వార్తలను ఐఆర్​సీటీసీ తోసిపుచ్చింది. మతంతో సంబంధం లేకుండా రైల్వే వినియోగదారులందరికీ ఈమెయిళ్లు చేసినట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేయడం కొత్తేం కాదని, గతంలోనూ అనేకసార్లు వినియోగదారులకు సంక్షేమ పథకాల గురించి మెయిళ్లు చేసినట్లు పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.