లైంగిక వేధింపుల కేసులో కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత స్వామి చిన్మయానంద్‌కు అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన ట్రస్టుకు చెందిన షాజాన్‌పుర్ న్యాయకళాశాలలో విద్యనభ్యసిస్తున్న లా విద్యార్థినిని లైంగికంగా వేధించారనే ఆరోపణలను స్వామి చిన్మయానంద్ ఎదుర్కొంటున్నారు.
లైంగిక వేధింపుల కేసులో గతేడాది సెప్టెంబర్ 20న చిన్మయానంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోరుతూ స్వామి చిన్మయానంద్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు నవంబర్ 16న తీర్పును రిజర్వ్ చేసింది. ఇవాళ చిన్మయానంద్‌కు బెయిల్ మంజూరు చేసింది.