ETV Bharat / bharat

లెక్చరర్​ టూ చీఫ్​ మినిస్టర్​.. 'జోగి' ప్రస్థానం

author img

By

Published : May 29, 2020, 5:46 PM IST

Updated : May 29, 2020, 6:00 PM IST

ఛత్తీస్​గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్​ జోగి 74 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. మెకానికల్ ఇంజనీరింగ్​లో గోల్డ్ మెడలిస్ట్ అయిన ఆయనకు చదవడం, రాయడం అంటే ఇష్టం. లెక్చరర్​గా, కలెక్టర్​గా పనిచేసిన ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఛత్తీస్​గఢ్ మొదటి ముఖ్యమంత్రిగా సేవలిందించారు.

Ajit Jogi- End of a Journey
లెక్చరర్​ నుంచి సీఎం వరకు అజిత్​ పయనం

ఛత్తీస్​గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ ప్రమోద్​ కుమార్​ జోగి 74 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఛత్తీస్​గఢ్ మొదటి ముఖ్యమంత్రిగా ఆయన రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు. ఆయన జీవిత విశేషాలు మీకోసం..

బాల్యం.. చదువు

  • 1946 ఏప్రిల్​ 29న ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లో అజిత్ జోగి జన్మించారు.
  • మౌలానా ఆజాద్​ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీలో బీఈ (మెకానికల్) పూర్తి చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్​లో బంగారు పతకం సాధించారు. ఆ సమయంలోనే విద్యార్థి సంఘం అధ్యక్షుడిగానూ ఉన్నారు.
  • దిల్లీ విశ్వవిద్యాలయం నుంచి ఎల్​ఎల్​బీ పూర్తి చేశారు.

కలెక్టర్​గా రికార్డు..

  • రాయ్​పుర్​లోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్చరర్​గానూ (1967-68) పనిచేశారు.
  • మధ్యప్రదేశ్​లో 12 ఏళ్లు సుదీర్ఘకాలం పాటు పనిచేసిన కలెక్టర్​గా అజిత్​ రోగి రికార్డు సృష్టించారు.

రాజకీయ జీవితం

  • అజిత్ జోగి తన రాజకీయ జీవితాన్ని 1986లో ఏఐసీసీ సభ్యుడిగా ప్రారంభించారు.

పదవులు

  • 1987లో (మధ్యప్రదేశ్​) ప్రదేశ్​ కాంగ్రెస్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
  • సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ, అటవీ కమిటీ ఛైర్మన్​గా పనిచేశారు.

కాంగ్రెస్ ఛాప్టర్-​1

  • 1995లో సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ అబ్జర్వర్​గా పనిచేశారు.1996 పార్లమెంటరీ ఎన్నికల సమయానికి ఏఐసీసీ కోర్ గ్రూప్ సభ్యుడయ్యారు.

కాంగ్రెస్ ఛాప్టర్​-2

  • 1997లో దిల్లీ ఏఐసీసీ పరిశీలకుడిగా నియమితులయ్యారు.
  • 1998లో రాయ్​గఢ్​ నియోజకవర్గం నుంచి 12వ లోక్​సభకు ఎన్నికయ్యారు.

వికాస్ యాత్ర

  • అజిత్ జోగి 2003లో ఛత్తీస్​గఢ్​ అంతటా వికాస్ యాత్ర (అభివృద్ధి యాత్ర) నిర్వహించారు.
  • దంతెవాడలోని మా దంతేశ్వరి ఆలయం నుంచి మహామాయ ఆలయం వరకు ప్రదర్శన నిర్వహించారు.

ఛత్తీస్​గఢ్ మొదటి ముఖ్యమంత్రిగా...

  • 2000లో ఛత్తీస్​గఢ్ మొదటి ముఖ్యమంత్రిగా అజిత్​ జోగి ప్రమాణ స్వీకారం చేశారు.
  • 2004లో మహాసముంద్ తరఫున 14వ లోక్​సభకు ఎన్నికయ్యారు.

కొత్త రాజకీయ పార్టీ

  • 2016 జూన్​లో అజిత్ జోగీ ఛత్తీస్​గఢ్ జనతా కాంగ్రెస్ అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు.
  • 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ సంచలనం సృష్టించింది.

ఆసక్తికర వాస్తవాలు

  • అజిత్ జోగి మంచి రచయిత కూడా. 'జిల్లా కలెక్టర్ పాత్ర' (ది రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్​), 'అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పెరిపెరల్ ఏరియాస్' అనే పుస్తకాలు ఆయన రాశారు.
  • అజిత్​ జోగికి చదవడం, రాయడం చాలా ఇష్టం. ఆయనకు క్షుద్ర శాస్త్రాలపై కూడా ఆసక్తి ఎక్కువ.

ఇదీ చూడండి: ఛత్తీస్​గఢ్​ మాజీ సీఎం అజిత్ జోగి కన్నుమూత

Last Updated : May 29, 2020, 6:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.