ఎయిరిండియా తాజాగా ఓ నిర్ణయం తీసుకొంది. విమానంలో చేసే ప్రతి ప్రకటన అనంతరం సిబ్బంది తప్పనిసరిగా జైహింద్ పలకాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని తక్షణం అమలు చేయాలని సూచించింది. ఎయిర్ ఇండియా కార్యనిర్వాహక డైరెక్టర్ అమితాబ్ సింగ్ ఈ ఆదేశాలు జారీ చేశారు. దేశంలో పుల్వామా దాడి తదనంతర పరిణామాలు భారతీయుల్లో దాగున్న దేశభక్తిని తట్టి లేపాయని,దానిని ఎల్లప్పుడూ గుర్తుచేసుకునేందుకే ఈ మార్గదర్శకాలిచ్చినట్లు అధికారులు అభిప్రాయపడ్డారు.
కొత్తేం కాదు...
2016లో ఎయిర్ ఇండియా మేనెజింగ్ డైరెక్టర్ అశ్వనీ లోహాని సైతం ఇదే తరహా మార్గదర్శకాలు జారీ చేశారు. విమాన కెప్టెన్ ప్రయాణీకులకు జైహింద్ తెలపాలని ఆయన సూచించారు.