వందే భారత్ మిషన్ ద్వారా ఆగస్టు 31 నాటికి ఎయిర్ ఇండియా రూ.2556.6 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో మార్చి 23 నుంచి దేశంలో అంతర్జాతీయ విమాన సేవలు నిలిచిపోయాయి. దీంతో విదేశాలలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు మే 6న 'వందే భారత్ మిషన్'ను ప్రారంభించింది కేంద్రం.
అందులో భాగంగా 2020 ఆగస్టు 31 నాటికి మొత్తం 4,505 ఎయిర్ ఇండియా విమానాలు సేవలందించాయని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు హర్దీప్. విదేశాల్లో చిక్కుకున్న వారిలో మొత్తం 11లక్షల మంది భారతీయులు స్వదేశానికి రాగా.. ఎయిర్ ఇండియా సేవల్ని 4లక్షల మంది వినియోగించుకున్నారని పేర్కొన్నారు. మరో 1.9లక్షల మందిని ఈ విమానాల ద్వారా విదేశాలకు తరలించినట్టు వివరించారు హర్దీప్.
ఇదీ చదవండి: ప్రజాప్రతినిధులపై కేసుల విచారణకు జిల్లాకో ప్రత్యేక కోర్టు!