ETV Bharat / bharat

ట్రంప్​ ఎఫెక్ట్​: మురికివాడలు ఖాళీ చేయాలని నోటీసులు

author img

By

Published : Feb 19, 2020, 4:01 PM IST

Updated : Mar 1, 2020, 8:37 PM IST

గుజరాత్​ అహ్మదాబాద్​లో ఈనెల 24న ప్రధాని మోదీ- అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ భారీ రోడ్​ షో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు మున్సిపల్​ అధికారులు. ఇప్పటికే అక్కడి మురికి వాడలు కనిపించకుండా గోడ నిర్మిస్తున్నారు. తాజాగా మొతెరా ప్రాంతంలోని మురికివాడలను ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేశారు.

Ahmedabad
ట్రంప్​ ఎఫెక్ట్​: మురికివాడలు ఖాళీ చేయాలని నోటీసులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ పర్యటనలో భాగంగా మురికివాడలు కనిపించకుండా దారి పొడవునా గోడ నిర్మిస్తున్న గుజరాత్​లోని అహ్మదాబాద్​ మున్సిపల్​ అధికారులు మరో అడుగు ముందుకేశారు. సర్దార్​ వల్లభాయ్ పటేల్​ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సబర్మతి వరకు జరిగే రోడ్​ షో ప్రాంతంలో మురికివాడల్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించేందుకు పూనుకున్నారు.

ఈ క్రమంలో నగరంలోని మొతెరా ప్రాంత మురికివాడల నివాసితులకు నోటీసులు జారీ చేశారు. ఆ ప్రాంతాన్ని 7 రోజుల్లో ఖాళీ చేయాలని ఆదేశించారు. అధికారుల నోటీసులతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.

Ahmedabad
మున్సిపల్​ కార్పొరేషన్​ నోటీసు

22 కిలోమీటర్ల మేర..

అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు ఘనస్వాగతం పలికేందుకు అహ్మదాబాద్​ ముస్తాబువుతోంది. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఈనెల 24న నగరంలో పర్యటిస్తారు ట్రంప్​. ఈ సందర్భంగా ట్రంప్​తో కలిసి ప్రధాని మోదీ 22 కిలోమీటర్ల మేర రోడ్​ షో నిర్వహించనున్నారు. ఇందు కోసం అక్కడి మున్సిపల్​ కార్పొరేషన్​ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమంలో 50వేల మంది వరకు పాల్గొంటారని అంచనా.

ఇదీ చూడండి: ట్రంప్-మోదీ ప్రారంభించే మోటేరా స్టేడియం విశేషాలివే...

Last Updated : Mar 1, 2020, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.