అయోధ్య రామమందిర నిర్మాణ భూమిపూజకు ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో ఆహ్వానించాల్సిన అతిథుల జాబితాకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు తుది రూపునిస్తోంది. రామ మందిర ఉద్యమంతో సంబంధం ఉన్న భాజపా అగ్రనేతలు ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, ఉమాభారతికి ఆహ్వానం పంపినట్లు ట్రస్టు తెలిపింది. భూమి పూజను దూరదర్శన్ ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది.
అన్ని మతాల పెద్దలు..
ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్‌భగవత్‌ను భూమిపూజకు ఆహ్వానించినట్లు ట్రస్టు సభ్యుడు అనిల్‌మిశ్రా తెలిపారు. అన్ని మతాల పెద్దలను కూడా ఆహ్వానించనున్నట్లు వెల్లడించారు. అతిథుల జాబితా ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదన్నారు.
కరోనా నేపథ్యంలో కేవలం 200 మందిని మాత్రమే ఆహ్వానించనున్నట్లు ట్రస్టు వెల్లడించింది. రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో ఆగస్టు 5న భూమిపూజ జరగనుంది.
ఇదీ చూడండి: ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి కోర్టు సమన్లు