తూర్పు దిల్లీ నియోజకవర్గం ఆప్ అభ్యర్థి అతిషి మార్లినా కంటతడి పెట్టారు. తనను భాజపా, ఆ పార్టీ అభ్యర్థి గౌతమ్ గంభీర్ దారుణంగా కించపరిచారని ఆరోపించారు.
భాజపా సభ్యులు, గౌతమ్ గంభీర్ అనుచరులు తూర్పుదిల్లీ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అపార్ట్మెంట్లలో కరపత్రాలు పంచి పెడుతున్నారని ఆరోపించారు అతిషి. ఆ కరపత్రాల్లో తన గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. తన తండ్రి, తల్లి, భర్త వేర్వేరు రాష్ట్రాల్లో పుట్టిన విషయాన్నీ రాజకీయం కోసం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు అతిషి. దిల్లీలో ఆప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్మీట్లో కన్నీటిపర్యంతం అయ్యారు.
"ఒక మహిళా అభ్యర్థిపై ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన గంభీర్ తూర్పు దిల్లీలోని లక్షలాది మహిళల రక్షణకు ఏం చేయగలరు?"
-అతిషి, ఆప్ అభ్యర్థి
ఈ కరపత్రాలపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు ఆప్ నేతలు.