ETV Bharat / bharat

కరోనా నిర్ధరణ పరీక్షలకు ఇకపై ఆధార్ తప్పనిసరి - కరోనా టెస్టులకు ఆధార్ తప్పనిసరి

కరోనా బాధితుల వివరాలను మరింత కచ్చితంగా గుర్తించేందుకు చెన్నై కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరీక్షల కోసం వచ్చే వారికి ఆధార్​ ధ్రువీకరణ తప్పనిసరి చేసింది. ఆధార్​ లేకుండా వచ్చేవారిని క్వారంటైన్​లో ఉంచాలని ఆదేశించింది.

Aadhaar mandatory for Corona test
కరోనా నిర్ధరణ పరీక్షలకు ఇకపై ఆధార్ తప్పనిసరి
author img

By

Published : Jun 4, 2020, 2:40 PM IST

కరోనా పరీక్షలు చేసేందుకు ఆధార్​ కార్డును తప్పనిసరి చేస్తూ చెన్నై కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కొవిడ్​ -19 మహమ్మారిని నియంత్రించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

చెన్నైలో ప్రస్తుతానికి 10 ప్రభుత్వ, 13 ప్రైవేటు ల్యాబ్​ల్లో కొవిడ్​-19 నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరికైనా కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయితే, వారి పూర్తి వివరాలు ఆరోగ్యశాఖ, కార్పొరేషన్​కు అందిస్తారు.

భయంతో.. తప్పుడు సమాచారం

కరోనా పరీక్షలు చేయించుకున్న వారిలో చాలా మంది తప్పుడు మొబైల్ నంబర్లు, చిరునామాలు ఇస్తున్నారు. కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయితే 14 రోజులు క్వారంటైన్ ఉండాలనే భయంతోనే వారు ఇలా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు కొన్ని ప్రైవేటు ప్రయోగశాలలు బాధితుల వివరాలను ప్రభుత్వానికి అందించడం లేదనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ కారణాల వల్ల వైరస్ బాధితులను గుర్తించడం కష్టం అవుతోంది.

అలాగే కొంత మంది కరోనా పరీక్షలు చేయించుకున్న వ్యక్తులకు నిర్ధరణ పరీక్షల ఫలితాలు తెలియకపోవడం వల్ల... వారు సూపర్ స్ప్రెడర్లుగా మారి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు. దీని వల్ల కరోనా మహమ్మారిని నియంత్రించాలన్న లక్ష్యమే నీరుగారుతోంది.

నేరుగా క్వారంటైన్​కే..

ఈ పరిస్థితిని నివారించేందుకు చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ప్రకాశ్ ఓ ఉత్తర్వును జారీ చేశారు. కరోనా పరీక్ష కోసం వచ్చిన వ్యక్తులకు ఆధార్​ తప్పనిసరి చేశారు. వారి ఆధార్ వివరాలను, మొబైల్ నంబర్​తో ధ్రువీకరించాలని స్పష్టం చేశారు. ఆధార్​ లేకుండా వచ్చిన వారిని క్వారంటైన్​లో ఉంచాలని నిర్దేశించారు.

ఇదీ చూడండి: చేపలు వలలోకి.. భద్రత గాలిలోకి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.