ETV Bharat / bharat

తల్లి మృతి.. లేపేందుకు చిన్నారి ప్రయత్నం! - A three year old girl child hoping for her dead mother to come alive waited in vain

గుండెను తొలిచేసే ఓ హృదయ విదారక ఘటనకు గుజరాత్ భరూచ్ జనరల్ ఆసుపత్రి వేదికైంది. తల్లి మరణించిందని తెలియక లేపేందుకు మూడేళ్ల కుమార్తె చేసిన ప్రయత్నం పలువురిని కంటతడి పెట్టించింది.

alive
'అమ్మా.. నిద్రమేల్కోవా.!'
author img

By

Published : Feb 22, 2020, 9:42 PM IST

Updated : Mar 2, 2020, 5:36 AM IST

ఆసుపత్రిలో ఉన్న తన తల్లిచుట్టూ తిరుగుతూ ఆటలాడింది ఆ చిన్నారి. తల్లి కళ్లు మూసి ఉండేసరికి... ఆటపట్టిస్తుందేమో అనుకుని కళ్లు తెరవమని ముద్దు మాటలాడింది. శాశ్వతనిద్రలోకి జారుకున్న ఆ తల్లిని లేపేందుకు చేసిన ఆ చిన్నారి ప్రయత్నాలు విఫలమవడం.. ఆసుపత్రి సిబ్బంది, మిగతా రోగులు, వారి సహాయకులకు కంటనీరు తెప్పించింది. గుజరాత్​లోని భరూచ్​లో జరిగిందీ ఘటన.

భరూచ్​లోని దాండియా బజార్ ప్రాంతానికి చెందిన మహిళ అనారోగ్యం కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. తల్లితో పాటు ఆసుపత్రికి వెళ్లింది మూడేళ్ల చిన్నారి ప్రిన్సీ. చిన్నారి తండ్రి గతంలోనే చనిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తల్లి అసువులు బాసింది. ఆదుకోవాల్సిన బంధువులు మొహం చాటేశారు. ఈ నేపథ్యంలో అనాథగా మారింది చిన్నారి ప్రిన్సీ. అయితే తల్లి చనిపోయిందని అర్థంకాక ఉత్సాహంగా మెదులుతోంది.

చిన్నారి ప్రిన్సీని అనాథ శరణాలయంలో ఉంచేందుకు ఏర్పాటు చేస్తానని ఓ సామాజిక కార్యకర్త ముందుకొచ్చాడు. అయితే పిల్లలు లేనివారు చిన్నారిని దత్తత తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

'అమ్మా.. నిద్రమేల్కోవా.!'

ఇదీ చూడండి: ట్రంప్​కు దిల్లీలో ప్రత్యేక విందు- మెనూ చాలా స్పెషల్​

Last Updated : Mar 2, 2020, 5:36 AM IST

For All Latest Updates

TAGGED:

surat
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.