ఒడిశా సంబల్పుర్లో 32 అడుగులు పొడవైన గౌను కుట్టి ప్రత్యేకంగా నిలిచాడు అనంత్ మెహర్. అనేక ఏళ్లుగా దర్జీ పని చేస్తున్నాడు ఆయన. జీవనాధారమైన టైలరింగ్ వృత్తిని మెహర్ ఎంతో గౌరవిస్తాడు. వ్యాపారం ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన నైపుణ్యాన్ని ఇలా విభిన్నంగా చాటుకున్నాడు.
ఈ భారీ గౌనును సంబల్పురీ అనే ప్రఖ్యాత చేనేత వస్త్రాన్ని ఉపయోగించి తయారు చేయడం మరో విశేషం.
చేనేత వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరగాలని ఆకాంక్షిస్తూ ఇలా చేశానని చెప్పాడు అనంత మెహెర్.