సాధారణంగా ఓ ఊర్లో ఒకే పేరుతో ఓ పది, ఇరవై మంది ఉంటేనే గందరగోళంగా ఉంటుంది. కానీ, కర్ణాటక, మైసూర్‌లోని ఓ గ్రామంలో తమాషాగా ఒకే పేరున్న వ్యక్తులు వేల మంది ఉన్నారు.
ఊర్లో పేరున్న పేర్లు ఇవే...
మైసూర్ జిల్లా, ఉబ్దూరు గ్రామంలో 2300 కుటుంబాలు నివసిస్తున్నాయి. మొత్తం జనాభా దాదాపు 15 వేలు ఉంటారు కాబోలు. కానీ, అందులో 10 వేల మందికిపైగా అంకప్పా, సిద్ధప్పా, సిద్ధయ్యా, మరిసిద్ధా ఈ నాలుగు పేర్లలో ఏదో ఒక పేరుంటుంది. అవును ఈ నాలుగు పేర్లే అక్కడ ఫేమస్. ఈ నాలుగింటిలో ప్రతి ఒక్క పేరు కనీసం 400 మందికైనా ఉంటుంది.
అంకప్పా, సిద్ధప్పా, సిద్ధయ్య, మరిసిద్ధా... ఇవి ఆ గ్రామస్థుల కులదైవాల పేర్లు. ఈ పేర్లనే తమ తాత ముత్తాతలు పెట్టుకున్నారు. కాబట్టి.. ఆ పరంపరను ఇప్పటికీ కొనసాగిస్తూ.. ఈ నాలుగు పేర్లకు ఇంతటి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చారు.
అయితే ఒకే పేరుతో ఇంత మంది ఉన్నప్పటికీ.. ఆ పేర్లతో పెద్దగా ఇబ్బందేమీ లేదు అంటున్నారు గ్రామస్థులు. రేషన్ కార్డు, ఆధార్ కార్డులతో ఎవరికి వారు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నారు కాబట్టి సమస్యేమీ లేదు అంటున్నారు.
ఇదీ చదవండి: పేరు ఒకటే కదా అని.. కరోనా రోగి డిశ్చార్జ్!