వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు చేరుకోవడానికి వీలుగా రైల్వే శాఖ ప్రత్యేక సర్వీసులను ఇదివరకే ప్రారంభించింది. సొంత రాష్ట్రాల్లో చేరిన తర్వాత అక్కడి ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రయాణికులు నిర్బంధంలో ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది.
అయితే దిల్లీ నుంచి బెంగళూరుకు చేరుకున్న రైలులోని కొంతమంది ప్యాసింజర్లు సంస్థాగత(ఇన్స్టిట్యూషనల్) క్వారంటైన్‌ను వ్యతిరేకించినట్లు భారతీయ రైల్వే తెలిపింది. మొత్తం 543 మంది ప్యాసింజర్లలో దాదాపు 140 మంది ప్రయాణికులు.. క్వారంటైన్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసినట్లు స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసులు నచ్చజెప్పడం వల్ల కొంత మంది క్వారంటైన్‌కు తరలివెళ్లేందుకు ఒప్పుకొన్నట్లు అధికారులు తెలిపారు. అయితే 19 మంది మాత్రం తిరిగి దిల్లీకి వెళ్లేందుకే మొగ్గుచూపారట. సంస్థాగత క్వారంటైన్ బదులుగా హోమ్ క్వారంటైన్కే వారు సముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో రైలుకు మరో కోచ్ జత చేసి వారిని దిల్లీకి తరలించే ఏర్పాట్లు చేసినట్లు రైల్వే యంత్రాగం తెలిపింది.