ETV Bharat / state

సచివాలయంలో 'బాహుబలి'ని మూసివేయాలని నిర్ణయం - CHANGES IN TELANGANA SECRETARIAT

సచివాలయానికి మరమ్మతులు - ప్రధాన గేట్లు, రోడ్లలో కీలక మార్పులు - తూర్పువైపు ఉన్న బాహుబలి గేటును శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయం

Telangana secretariat gate Changes
Changes in Telangana secretariat (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 7, 2024, 6:03 PM IST

Updated : Nov 7, 2024, 7:27 PM IST

Govt on Few Changes in Telangana Secretariat : సచివాలయంలో ప్రధాన గేట్లు, రోడ్లలో కీలక మార్పులు చేస్తున్నారు. తూర్పు వైపు ఉన్న బాహుబలి గేటుగా పిలిచే ప్రధాన గేటును శాశ్వతంగా మూసివేయాలని నిర్ణయించారు. ఈశాన్యం వైపు ఇప్పుడున్న గేటు పక్కన మరోగేటు నిర్మించనున్నారు. సుమారు 3 కోట్ల 20 లక్షల రూపాయలతో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయానికి ప్రస్తుతం నాలుగు వైపుల ప్రధాన గేట్లు ఉన్నాయి. తూర్పు వైపు లుంబినీ పార్క్ ఎదురుగా ఉన్న బాహుబలి గేటు నుంచి కేసీఆర్ రాకపోకలు జరిపే వారు. ఆ గేటు నుంచి సచివాలయం లోపల ప్రధాన ద్వారం వరకు రాకపోకలు కొంతకాలంగా నిలిపివేశారు.

ఆ మార్గంలోనే తెలంగాణ తల్లి విగ్రహంతో పాటు చుట్టూ లాన్, ఫౌంటెయిన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక తూర్పు గేటును శాశ్వతంగా మూసివేయనున్నారు. పశ్చిమాన మింట్ కాంపాండ్ వైపున ఉన్న మూడో గేటును కొన్ని సందర్భాల్లో తక్కువగా ఉపయోగిస్తున్నారు. అటువైపు ఎలాంటి మార్పులు చేయడం లేదు. ప్రధాన రహదారి వైపు ఉండే సౌత్-ఈస్ట్ గేటు నుంచి సచివాలయం సిబ్బంది, సాధారణ ప్రజల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్ అధికారులు ప్రస్తుతం ఈశాన్యం వైపు గేటును ఉపయోగిస్తున్నారు. ఆ గేటు పక్కనే మరో గేటు నిర్మించనున్నారు. ఒక గేటు నుంచి లోనికి వెళ్లి మరో గేటు నుంచి బయటుకు వేళ్లేలా ప్రణాళిక చేశారు.

వాస్తుతో పాటు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు కోసం : ఈశాన్యం, ఆగ్నేయం గేట్లను కలుపుతూ ఒక రోడ్డు కూడా నిర్మిస్తున్నారు. వాస్తుతో పాటు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తున్న కారణంగా ఈ మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సచివాలయం నిర్మాణం తరువాత ఇలా మార్పులు చేయడం ఇదే తొలిసారి. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పాత భవనాలను కూల్చి వేసి కొత్త సచివాలయంను నిర్మించింది. 28 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ బిల్డింగ్​ను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఏడాది ఏప్రిల్ 30న ప్రారంభించారు. సెక్రటేరియట్​లో జరుగుతున్న ఈ వాస్తు మార్పులను బీఆర్​ఎస్ నేత హరీశ్ రావు ఎక్స్​ వేదికగా తప్పుపట్టారు.

'ఒక్క గేటు మార్చడానికి రూ.4 కోట్లా?'

సచివాలయం భద్రతా విధుల నుంచి తెలంగాణ స్పెషల్ పోలీస్ తొలగింపు

Last Updated : Nov 7, 2024, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.