ETV Bharat / entertainment

పుష్ప 2కి ఒక్కరు కాదు ముగ్గురు- పెరుగుతున్న లిస్ట్​! - PUSHPA 2 BGM COMPOSERS

పాన్‌ ఇండియా సినిమా పుష్ప 2కి ఏకంగా ముగ్గురు మ్యూజిక్‌ డైరెక్టర్లు బీజీఎం అందిస్తున్నట్లు టాక్!

Pushpa 2
Pushpa 2 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2024, 6:29 PM IST

Pushpa 2 BGM Composers : టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 మూవీపై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చర్చలు నడుస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం వల్ల సీక్వెల్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో వినిపించిన ఓ వార్త మూవీపై ఆసక్తికర చర్చలకు తెరలేపింది. దీంతో అల్లు అర్జున్‌ అభిమానులు, సినీ ప్రియులు దానికోసమే చర్చించుకుంటున్నరాు.

పుష్ప 2కి స్టార్ మ్యూజిక్‌ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్​తో అల్లు అర్జున్, సుకుమార్ సంతృప్తి చెందలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో డైరెక్టర్, హీరో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ బాధ్యతలు మరో స్టార్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ ఎస్​ఎస్ తమన్​కు అందించాలని భావించినట్లు తెలిసింది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న మరో రూమర్‌, మరింత గందరగోళాన్ని పెంచింది.

పాన్ ఇండియా మూవీ పుష్ప 2కి ముగ్గురు మ్యూజిక్‌ కంపోజర్లు బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందించనున్నట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ప్రాజెక్టులోకి తమన్‌తోపాటు అజనీష్ లోక్‌నాథ్ (కాంతారా, మంగళవారం ఫేమ్), సామ్ సీఎస్ కూడా అడుగు పెట్టారట. సినిమాలోని ప్రత్యేక సీక్వెన్స్‌లకు ఈ ముగ్గురు వేర్వేరుగా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్ అందిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే మూవీ రిలీజ్‌కు చాలా తక్కువ సమయం ఉంది. డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలను ప్లాన్‌ చేశారు మేకర్స్. అప్పటిలోగా బీజీఎం వర్క్స్ పూర్తవుతాయా? లేదా? మరోసారి మూవీ రిలీజ్‌ వాయిదా పడుతుందా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అయితే బీజేఎం కంపోజర్స్ ముగ్గురు అంటూ వస్తున్న వార్తలకు సంబంధించి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. స్పెషల్ సాంగ్ షూట్ నవంబర్ రెండో వారంలోగా పూర్తి చేస్తారని, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అప్పుడే పూర్తి అవుతాయని టాక్ నడుస్తోంది. పుష్ప 2లో కూడా రష్మికనే హీరోయిన్‌గా నటిస్తోంది. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై భారీ బడ్జెట్​తో నవీన్ ఎర్నేని, రవి శంకర్‌ నిర్మిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.