ETV Bharat / technology

పెరుగుతున్న స్మార్ట్​ఫోన్ల ధరలు- అసలు తయారీకి కంపెనీలు ఎంత ఖర్చుపెడుతున్నాయో తెలుసా? - SMARTPHONE PRICES IN INDIA

'తయారీ కంటే రెట్టింపు ధరకు స్మార్ట్​ఫోన్ల విక్రయాలు'- ఐఫోన్, పిక్సెల్ మొబైల్స్ మేకింగ్ ప్రైస్ రివీల్!

Apple and Google
Apple and Google (Apple and Google)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 7, 2024, 6:15 PM IST

Smartphone Prices in India: ప్రస్తుతం స్మార్ట్​ఫోన్ల ట్రెండ్ నడుస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ మొబైల్స్​ను యూజ్ చేస్తున్నారు. అందులో యూత్​ అయితే ధర ఎక్కువగా ఉన్నా పర్లేదని ప్రీమియం మొబైల్స్​ వైపే మొగ్గు చూపిస్తోంది. దీంతో యాపిల్, గూగుల్ వంటి కంపెనీల నుంచి వస్తున్న ప్రీమియం స్మార్ట్​ఫోన్ల సేల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ మొబైల్స్​ను తయారు చేసేందుకు కంపెనీలు ఎంత ఖర్చు చేస్తున్నాయో తెలుసా?.

గత కొన్ని సంవత్సరాలుగా యాపిల్, గూగుల్ కంపెనీల నుంచి వస్తున్న ఫ్లాగ్​షిప్ మొబైల్స్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ కంపెనీలు రిలీజ్ చేస్తున్న లేటెస్ట్ ఐఫోన్, పిక్సెల్ మొబైల్స్ ధర చాలావరకు లక్ష రూపాయలు పైనే ఉంటున్నాయి. అయితే వీటి ధరలు ఎందుకు ఇంతలా పెరుగుతున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మొబైల్స్​ను తయారు చేసేందుకు కంపెనీలు ఎంత ఖర్చు చేస్తున్నాయి? మనకు ఎంతకు అమ్ముతున్నాయి? అనే వివరాలపై Nikkei నుంచి వచ్చిన కొత్త రిపోర్ట్ సమాచారాన్ని అందించింది.

గత కొంతకాలం నుంచి స్మార్ట్​ఫోన్ల ధరలు ఎలా పెరుగుతూ వస్తున్నాయో అందరికీ తెలిసిందే. అయితే తమ మొబైల్స్​లో అత్యంత పవర్​ఫుల్ చిప్​లను ఉపయోగించడం వల్ల తయారీ ఖర్చు పెరుగుతోందని ఈ కంపెనీలు చెప్పుకొస్తున్నాయి. దీంతోపాటు తమ స్మార్ట్​ఫోన్ ధరలు పెరుగుదలకు ద్రవ్యోల్బణాన్ని మరో కారణంగా చూపిస్తున్నాయి.

అయితే Nikkei నివేదిక నుంచి వచ్చిన సమాచారం ప్రకారం..'గూగుల్ పిక్సెల్ 8 ప్రో' మొబైల్​తో పోలిస్తే 'పిక్సెల్ 9 ప్రో' మెటీరియల్స్ బిల్లు (BOM) 11 శాతం తగ్గింది. 'పిక్సెల్ 8 ప్రో'తో పోలిస్తే 'పిక్సెల్ 9 ప్రో' మొబైల్ స్కీన్, బ్యాటరీ కూడా చాలా చిన్నవి. అయితే ధరలో మాత్రం 'పిక్సెల్ 9 ప్రో' చాలా ఖరీదైంది. 'పిక్సెల్ 9 ప్రో' Tensor G4 చిప్ ధర $80 (రూ. 6,800). కానీ శాంసంగ్ M14 డిస్‌ప్లే, కెమెరా ధరలు వరుసగా 75 డాలర్లు (రూ. 6,300), 61 డాలర్లు (రూ. 5,100).

ఇక ఐఫోన్ 16 ప్రో BOM ధర దాని ప్రీవియస్ మోడల్ ఐఫోన్ 15 ప్రో కంటే 6 శాతం ఎక్కువ. అయితే A18 ప్రో చిప్‌సెట్ కోసం యాపిల్ $135 (రూ. 11,400) వెచ్చించనుందని ఈ నివేదిక పేర్కొంది. దీని స్క్రీన్, కెమెరా ధరలు వరుసగా 110 డాలర్లు (రూ. 9,300), 91 డాలర్లు (రూ. 7,700) మాత్రమే ఉంటుందని అంచనా.

అంటే ఈ నివేదిక ప్రకారం యాపిల్, గూగుల్ కంపెనీలు తమ లేటెస్ట్ 'ప్రో' మొబైల్స్​ను తయారీ ధర కంటే రెట్టింపు ధరకు విక్రయిస్తున్నాయి. అయితే ఇందులో షిప్పింగ్, డెలివరీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మార్కెటింగ్ వంటి ఇతర ఖర్చులను మినహాయించి ఈ రిపోర్ట్ సమాచారం అందించిందని గమనించాలి.

ఫ్యామిలీతో కలిసి టీవీ చూడలేకపోతున్నారా?- ఈ ఫీచర్​తో ఇకపై అడల్ట్ సీన్స్ భయం లేదుగా..!

సుజుకి మోటార్ కార్పొరేషన్ మొట్టమొదటి ఈవీ- ఫస్ట్ లుక్​ మామూలుగా లేదుగా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.