ETV Bharat / entertainment

గూస్​బంప్స్​ తెప్పిస్తున్న 'ఘాటి' గ్లింప్స్ - అనుష్కను ఇలా ఎప్పుడు చూసుండరుగా! - ANUSHKA GHAATI MOVIE

చేతిలో చుట్ట, రక్తంతో తడిచిన మొఖం - గూస్​బంప్స్​ తెప్పిస్తున్న 'ఘాటి' గ్లింప్స్!

Anushka Ghaati Glimpse
Anushka (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2024, 5:10 PM IST

Anushka Ghaati Glimpse : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. గతకొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, గతేడాది వచ్చిన మిస్​ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో మరో బ్లాక్​బస్టర్​ను తన ఖాతాలో వేసుకుంది. అయితే ఇప్పుడు డైరెక్టర్ క్రిష్‌ తెరకెక్కిస్తున్న ఓ పాన్‌ ఇండియాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. 'ఘాటి' అనే టైటిల్​తో ఈ సినిమా తెరకెక్కనుంది.

గతంలోనే క్రిష్ ఈ సినిమా గురించి ప్రకటించగా, నేడు (నవంబర్ 7) అనుష్క బర్త్​డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్​ అలాగే గ్లింప్స్​ను విడుదల చేశారు మేకర్స్​. ఇందులో ఆమె నేరస్థురాలిగా మారిన ఓ బాధితురాలిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. చేతిపైన ఓ విచిత్రమైన టాటూతో గొడ్డలి పట్టుకుని ఫుల్​ పవర్​ఫుల్​గా కనిపిచింది. అంతేకాకుండా ఓ వ్యక్తిని నరికి అతడి తలను చేతిలో పట్టుకుని వస్తుంది. అనుష్క ఇటువంటి రోల్​ మునుపెన్నడు చేయన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆద్యంతం ఎంతో థ్రిల్లింగ్​గా ఉన్నఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.

ఇక ఉదయం రివీలైన పోస్టర్​లోనూ అనుష్క చుట్ట కాలుస్తూ డిఫరెంట్​ షేడ్స్​ ఉన్న లుక్​లో కనిపించింది. దీంతో ఈ సినిమాతో ఆమె మరో హిట్​ను ఖాతాలో వేసుకోవడం ఖాయమంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. స్వీటీకి నెట్టింట బర్త్​డే విషెస్ తెలుపుతున్నారు.

స్వీటీ తొలి మలయాళ సినిమా పనులు ఎలా జరుగుతోందంటే?
Anushka Shetty Fantasy Thriller Kathanar : మరోవైపు అనుష్క 'ఘాటి'తో పాటు 'కథనార్‌ - ది వైల్డ్‌ సోర్సెరర్‌' అనే మాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తున్నారు. ఇది ఆమెకు మొదటి మలయాళ సినిమా కావడం విశేషం. హారర్‌ ఫాంటసీ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంది

కేరళలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. సుమారు 212 రోజుల పాటు 6 షెడ్యూల్స్‌లో ఈ సినిమా పూర్తి చేసుకున్నట్లు డైరెక్టర్​ రోజిన్ థామస్ చెప్పారు. 9వ శతాబ్దపుకు చెందిన క్రైస్తవ మత గురువు కడమత్తత్తు కథనార్‌ కథను ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇక ప్రస్తుతం ఈ చిత్ర​ నిర్మాణానంతర పనులు కూడా చాలా ఫాస్ట్​గానే సాగుతున్నాయి. 14 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే రిలీజ్​ డేట్​ కూడా రివీల్ చేసే ఛాన్స్​లు ఉన్నట్లు సినీ వర్గాల మాట. రాహుల్‌ సుబ్రహ్మణ్యం సంగీతం అందించిన ఈ చిత్రానికి నీల్‌ డి కున్హా ఛాయాగ్రహణం బాధ్యతలు చూసుకున్నారు.

అనుష్క రివీల్​ చేసిన 'సూడోబుల్బర్ ఎఫెక్ట్' - అది వస్తే నవ్వినా ఏడ్చినా అస్సలు ఆపుకోలేరట! - ANUSHKA SHETTY RARE DISEASE

అనుష్క ఒరిజినల్ క్యారెక్టర్​ ఇదే - అసలు విషయం బయటపెట్టిన మేకప్​మెన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.