గుజరాత్‌లోని గోద్రా వద్ద ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 35 మంది గాయపడ్డారు. వారిలో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వడోదర ఆస్పత్రికి తరలించారు.

వలస కూలీలతో నిండిన బస్సు.. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి సూరత్‌కు వెళ్లే క్రమంలో గోద్రా రహదారిపై ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నియంత్రణ లోపం కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఫడణవీస్, రౌత్‌ల రహస్య భేటీతో వేడెక్కిన 'మహా' రాజకీయం