ETV Bharat / bharat

వైరల్​: ప్రయాణికురాలితో కండక్టర్​ వికృత చేష్టలు - conductor news

కర్ణాటకలో ఆర్టీసీ బస్సులో ఒంటరిగా ఉన్న మహిళా ప్రయాణికురాలి పట్ల ఓ కండక్టర్​ అసభ్యంగా ప్రవర్తించాడు. దక్షిణ కన్నడ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. కండక్టర్​ వికృత చేష్టలను వీడియో తీసిన మహిళ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసింది.

వైరల్​: మహిళా ప్రయాణికురాలితో కండక్టర్​ వికృత చేష్టలు
author img

By

Published : Feb 18, 2020, 10:15 AM IST

Updated : Mar 1, 2020, 5:00 PM IST

మహిళలపై ఆకతాయిల అకృత్యాలు దేశంలో ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ ఆర్టీసీ బస్సు కండక్టర్..​ మహిళా ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో చోటు చేసుకుంది. అతని వికృత చేష్టలను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసింది ఆ మహిళ. ప్రస్తుతం ఈ దృశ్యాలు వైరల్​గా మారాయి.

వైరల్​: మహిళా ప్రయాణికురాలితో కండక్టర్​ వికృత చేష్టలు

ఇదీ జరిగింది..

బెంగళూరు నుంచి పుత్తూర్​కు వెళ్తున్న కర్ణాటక రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఓ బస్సులో ప్రయాణిస్తున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఆ బస్సు కండక్టర్​. ఒంటరిగా ఉన్న మహిళ పక్కన కూర్చొని.. వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఆమె శరీర భాగాలను తాకేందుకు ప్రయత్నిస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. కండక్టర్​ చర్యలను వీడియో తీసిన సదరు మహిళ.. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు వైరల్​గా మారాయి.

ఈ దృశ్యాలు కేఎస్​ఆర్​టీసీ అధికారులకు చేరాయి. వీడియో ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి: వినూత్నం: హాల్​టికెట్ లాంటి పెండ్లి​పత్రిక..!

Last Updated : Mar 1, 2020, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.