ETV Bharat / bharat

పొగ​ తాగొద్దని చెప్పాడని మూకదాడి- వ్యక్తి మృతి - Begalure murder updates

రోడ్డుపై సిగరెట్​ తాగొద్దనడమే అతడు చేసిన నేరమైంది. అక్కడి నుంచి వెళ్లిపొమ్మని చెప్పడం వల్ల.. ఆగ్రహానికి లోనైన ముగ్గురు యువకులు ఓ వ్యక్తిపై దాడికి దిగారు. నడిరోడ్డుపైనే కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన బెంగళూరులో జరిగింది.

A man Questioned the Youths off for Smoking amid the Road
ఘోరం: సిగరెట్​ కాల్చొద్దన్నందుకు కొట్టి చంపారు.!
author img

By

Published : Aug 6, 2020, 2:57 PM IST

రోడ్డుపై సిగరెట్​ కాల్చొద్దన్నందుకు కొందరు యువకులు మూకుమ్మడిగా దాడి చేసి ఓ వ్యక్తిని హత్య చేశారు. ఈ ఘోరం బెంగళూరులో జరిగింది.

అసలేం జరిగిందంటే..

బెంగళూరు నెలమంగళలో ఓ బేకరీ సమీపంలో ముగ్గురు యువకులు బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సిగరెట్​ కాలుస్తూ ఉన్నారు. ఇది గమనించిన స్థానికుడు అరుణ్​.. ఇక్కడ పొగతాగొద్దని చెప్పాడు. అప్పటికే గంజాయి మత్తులో ఉన్న సల్మాన్(22), ఇమ్రాన్(21)​, సుజైన్(24)​ అనే ముగ్గురు యువకులు అరుణ్​తో గొడవకు దిగారు. పరుష పదజాలంతో దూషించారు. అంతటితో ఆగకుండా అరుణ్​ను చితకబాదారు. తీవ్ర రక్తస్రావంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడా బాధితుడు.

Arun
అరుణ్​

స్టేషన్​ పక్కనే..

ఈ గొడవ నెలమంగళ పోలీస్​ స్టేషన్​ సమీపంలోనే జరిగింది. అరుణ్ ఆర్తనాదాలు వినిపించినా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు.

హత్య అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బేకరీ సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అరెస్ట్​ చేశారు. ఆ ముగ్గురు కూడా బనశంకరి వాసులు కాగా.. తమ బంధువుల కోసం నెలమంగళకు వచ్చారని తెలుస్తోంది.

ఇదీ చదవండి: 75 ఏళ్ల బామ్మపై అత్యాచారం- నిందితుల్లో 66 ఏళ్ల మహిళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.