జేఎన్యూ ఘటనపై నిజనిర్ధరణ కోసం నలుగురు సభ్యులతో కూడిన ఓ కమిటీ ఏర్పాటు చేశారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ కమిటీ పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదికను వారం రోజుల్లో ఇవ్వాల్సిందిగా సోనియా ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో జేఎన్యూ విద్యార్థులను, అధికారులను కలవనున్నారు కమిటీ సభ్యులు.
" జేఎన్యూలో దాడిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిజ నిర్ధరణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ జేఎన్యూ ఆవరణలో జరిగిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి వారం రోజుల్లో కాంగ్రెస్ అధ్యక్షురాలికి నివేదించనుంది."
-కాంగ్రెస్ పార్టీ వర్గాలు.
ఈ కమిటీలో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుశ్మితా దేవ్, మాజీ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు అమృతా ధావన్, కాంగ్రెస్ ఎంపీలు హిబీ ఈడెన్, సయ్యద్ నాసీర్ హుస్సేన్లు ఉన్నారు.
ఇదీ చూడండి:'ముసుగు వ్యక్తుల సమాచారముంటే మాకివ్వండి'