లైవ్ వీడియో: కారుపైకి దూసుకొచ్చిన మరో కారు
ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ అకస్మాత్తుగా మూర్ఛపోవటం వల్లే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సీసీటీవీ కెమెరాలో నిక్షిప్తమైన ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
మూర్ఛపోయిన డ్రైవర్‌తో పాటు ఓ పాదచారుడు, పానీపూరీ బండి యజమానికి ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. డ్రైవరుపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.