తినుబండారాలతో ఆకర్షించి లాభాలు దండుకునే పరిశ్రమలు చిన్నారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. కిరాణా దుకాణాలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదించాలనే తాపత్రయంతో నాణ్యత లేని పదార్థాలను పిల్లలకు విక్రయిస్తున్నాయి. తమిళనాడు పెరంబలూర్ జిల్లా, అలాంబడి గ్రామంలో ఓ జెల్లీ చాక్లెట్ నాలుగేళ్ల చిన్నారిని బలిగొంది.
రంగనాథన్ ఓ నాలుగేళ్ల బాబు.. ఇంటి పక్కనే ఉన్న చిన్న కిరాణ దుకాణంలో జెల్లీ చాక్లెట్ కొనుకున్నాడు. కలర్ఫుల్గా కనిపించేసరికి ఒకే సారి మింగే ప్రయత్నం చేశాడు. కానీ చిన్నారి చిన్ని ఆహార నాళంలోకి ఆ మాయదారి జెల్లీ జారలేదు.శ్వాసకోశాల్లోకి గాలి వెళ్లకుండా మూసివేసింది.ఊపిరాడక కాసేపు ఉక్కిరిబిక్కిరయ్యాడు. కొద్ది క్షణాలు ప్రాణాలతో పోరాడి ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే కన్ను మూశాడు. కళ్ల ముందే కన్న కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు
బాలుడి మృతదేహాన్ని పంచనామాకు తరలించారు పోలీసులు.
ఇదీ చూడండి: 'నేతాజీ అదృశ్యమై 74ఏళ్లు... ఇంతకీ ఏమైంది?'