రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
జీపు, బస్సు ఢీ
భిల్వారా జిల్లాలోని పవన్ ధామ్ వద్ద జీపు... బస్సును ఢీ కొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రోడ్డుపై ఉన్న అయిదుగురు సహా 11 మంది గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.
ప్రమాదంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తగిన చికిత్స అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: ఆప్ కీ దిల్లీ: హ్యాట్రిక్ దిశగా కేజ్రీ.. మళ్లీ ప్రభంజనం!