ETV Bharat / bharat

లాక్​డౌన్​ కొనసాగించాలని 88% మంది ఓటు

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ వచ్చే మంగళవారంతో ముగియనుంది. కానీ, దేశంలో కరోనా కేసులు మాత్రం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ కొనసాగించాలా? వద్దా? అని అడిగితే 88 శాతం మంది ప్రజలు ముక్తకంఠంతో పొడిగించాలనే కోరుతున్నారు.

88-percent-indians-says-lockdown-should-be-extended-an-inshorts-survey-result-poll
లాక్​డౌన్​ కొనసాగించాలని 88% మంది ఓటు
author img

By

Published : Apr 10, 2020, 8:57 AM IST

దేశంలో కరోనా వైరస్​ వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో ఈ నెల 14 తర్వాత కూడా లాక్​డౌన్​ను కొనసాగించడమే ఉత్తమమని ఓ సర్వేలో తేలింది. ఓ వార్తా సంస్థ​ ​నిర్వహించిన సర్వే ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ, వైరస్​ వ్యాప్తిని నియంత్రించడానికి లాక్​డౌన్​ సరైన మార్గమని 88% మంది ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ ఆన్​లైన్​ సర్వేలో పాల్గొన్న 40 వేల మందిలో 92 శాతం మంది కొవిడ్​-19 పరీక్షలు నిర్వహించేందుకు ప్రైవేటు రంగాలకు అనుమతివ్వాలని సూచించారు.

ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే లాక్​డౌన్​ కాలాన్ని ఈ నెల 30 వరకు పొడిగించింది. విద్యాసంస్థలను జూన్​ 17 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

ఇదీ చదవండి:'ఏప్రిల్​ 30 వరకు లాక్​డౌన్​ కొనసాగింపు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.