ETV Bharat / bharat

భారత తల్లిదండ్రుల గుండెల్లో గుబులు.. కారణమిదే!

దేశంలో 85 శాతానికి పైగా తల్లిదండ్రులు కరోనా కాలంలో తమ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారని ఓ సర్వేలో తేలింది. ఇక లాక్​డౌన్ వేళ తమ బిడ్డలకు తామే చదువు చెబుతున్నామని దక్షిణాది రాష్ట్రాల్లోని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రం తమ పిల్లలను చదివించే నైపుణ్యం లేదని చింతిస్తున్నారని సర్వే వెల్లడించింది.

85% Indian parents anxious about kid's future: Survey
భారత తల్లిదండ్రుల గుండెల్లో గుబులు.. కారణమిదే!
author img

By

Published : Jun 12, 2020, 6:20 PM IST

Updated : Jun 12, 2020, 7:16 PM IST

కరోనా మహమ్మారి భారత్​లో తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. లాక్​డౌన్​ కారణంగా విద్యాసంవత్సరమంతా ఇంట్లోనే గడిచింది. అందుకే ఈ కరోనా కాలంలో 85 శాతం మంది తల్లిదండ్రుల్లో పిల్లల భవిష్యత్తు గురించి చింత పెరిగిందని ఓ సర్వే వెల్లడించింది.

నర్సరీ నుంచి ఇంటర్ వరకు​ విద్యార్ధుల తల్లిదండ్రులపై ఓ సర్వే చేపట్టింది లీడ్​ స్కూల్. 5 వేల మంది పాల్గొన్న ఈ సర్వేలో 70 శాతం మంది వారి పిల్లల విద్యాభ్యాసం గురించి చింతిస్తున్నారు. ​ 78 శాతం మంది వారి పిల్లల ఆరోగ్యం గురించి, 40 శాతం మంది ఓ విద్యా సంవత్సరం కోల్పోతున్నారని బాధపడుతున్నారు.

"తల్లిదండ్రులు ఈ సమయంలోనే ఆచితూచి పాఠశాలలను ఎంపిక చేసుకోవాలి. తల్లిదండ్రులు పాఠశాలలను నమ్మి కలిసి ముందడుగు వేయాలి."

-సుమీత్ మెహ్రా, లీడ్ స్కూల్​ సీఈఓ

70 శాతం మంది తల్లిదండ్రులు ఇంట్లోనే తమ పిల్లలకు చదువు నేర్పిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. మరో 60 శాతం మంది ఆన్​లైన్​ క్లాసులను నమ్ముకున్నారు. 79 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో సరిగ్గా సమయమే గడపట్లేదు.

సర్వే ప్రకారం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​, రాజస్థాన్​, హరియాణాలలోని తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పించే నైపుణ్యం తమకు లేదని భావిస్తున్నారు. ఇక దక్షిణ భారతంలోని కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణలలో తల్లిదండ్రులు తమ పిల్లలను లాక్​డౌన్​లోనూ చదివించగలుగుతున్నామని విశ్వసిస్తున్నారు.

ఇదీ చదవండి:'యూ ఫర్ అగ్లీ' అని నేర్పిన టీచర్లు.. సస్పెండ్​!

Last Updated : Jun 12, 2020, 7:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.