ETV Bharat / bharat

కరోనా బాధితుల్లో ఉండే 8 ప్రధాన లక్షణాలివే

author img

By

Published : Jun 14, 2020, 7:01 AM IST

కరోనా బాధితుల్లో 8 ప్రధాన లక్షణాలు కనిపిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం 15,366 రోగుల్లో లక్షణాలను అధ్యయనం చేయగా అందులో 27% మందిలో జ్వరం, 21% మందిలో దగ్గు, 10% మందిలో గొంతుమంట, 8% మందిలో శ్వాస సంబంధ సమస్య, 7% మందిలో బలహీనత, 3% మందిలో ముక్కులు కారటం కనిపించినట్లు పేర్కొంది. మిగిలిన 24% మందిలో ఇతర లక్షణాలున్నాయని వెల్లడించింది. కరోనా లక్షణాలు కనిపించడానికి రెండు రోజుల ముందు నుంచే బాధితుల్లో ఇబ్బందులు మొదలవుతున్నట్లు తెలుస్తోంది.

8 SYMPTOMS RECOGNIZED IN CORONA VIRUS PATIENTS
కరోనా బాధితుల్లో ఉండే 8 ప్రధాన లక్షణాలు ఇవే

దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్‌ రోగుల్లో 8 ప్రధాన లక్షణాలు కనిపిస్తున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అందులో 1.జ్వరం 2.దగ్గు 3.అలసట, 4.శ్వాసలో ఇబ్బంది 5.గొంతులో కఫం 6.కండరాల్లో నొప్పి 7.ముక్కులు కారటం, గొంతులో మంట, అతిసారం, 8.శ్వాస సంబంధమైన సమస్యలు తలెత్తడానికి ముందు వాసన, రుచి కోల్పోవటం లాంటి లక్షణాలు రోగుల్లో కన్పించినట్లు పేర్కొంది. వయోవృద్ధులు, రోగ నిరోధకశక్తి తగ్గిన వ్యక్తుల్లో జ్వరం లేకపోయినా అలసటతో పాటు ఉత్సాహం, కదలికలు తగ్గడం, అతిసారం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లు తెలిపింది. అయితే, పెద్దల్లో మాదిరిగా పిల్లల్లో జ్వరం, దగ్గు ఉండటంలేదని పేర్కొంది.

అత్యధికులకు జ్వరమే...

హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ ప్లాట్‌ఫాం, ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వైలెన్స్‌ ప్రోగ్రాం పోర్టల్స్‌లో సమీకరించిన సమాచారం ప్రకారం మొత్తం 15,366 రోగుల్లో లక్షణాలను అధ్యయనం చేయగా అందులో 27% మందిలో జ్వరం, 21% మందిలో దగ్గు, 10% మందిలో గొంతుమంట, 8% మందిలో శ్వాస సంబంధ సమస్య, 7% మందిలో బలహీనత, 3% మందిలో ముక్కులు కారటం కనిపించినట్లు పేర్కొంది. మిగిలిన 24% మందిలో ఇతర లక్షణాలున్నాయని వెల్లడించింది. కొవిడ్‌-19 వ్యాధి లక్షణాల జాబితాలో వాసన, రుచి గుర్తించలేకపోవటాన్నీ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా చేర్చింది.

తీవ్రతను బట్టి చికిత్స

మధుమేహం, బీపీ, గుండె జబ్బులు, దీర్ఘకాల ఊపిరితిత్తుల సమస్య, మస్తిష్క నాడీ సంబంధ సమస్యలు, దీర్ఘకాల కిడ్నీ సమస్యలు, కేన్సర్‌తో పాటు, రోగ నిరోధకత తగ్గిపోయిన వారికి ముప్పు తీవ్రత ఎక్కువగా ఉంటుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఏ స్థాయి రోగిని ఎక్కడ ఉంచి చికిత్స అందించాలి, ఏయే మందులు ఉపయోగించాలన్న దానిపై మార్గదర్శకాలు జారీచేసింది.

  • జ్వరం, దగ్గు, గొంతుమంట, ముక్కు దిబ్బడ, ఆయాసం, తలనొప్పిలాంటి లక్షణాలుండి పెద్దగా శ్వాససంబంధ ఇబ్బందుల్లేని వారిని తేలికపాటి కేసులుగానే పరిగణించి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో కానీ, ఇళ్లలో కానీ ఉంచి వైద్యం అందించాలని సూచించింది.
  • తీవ్ర లక్షణాలు లేకుండా కేవలం నిమోనియా ఉన్న కేసులను ఓ మోస్తరు కేసుల కింద చేర్చి డెడికేటెడ్‌ కొవిడ్‌ హెల్త్‌ కేర్‌ సెంటర్‌లో ఉంచి చికిత్స చేయాలని పేర్కొంది.
  • తీవ్రమైన నిమోనియా, అకస్మాత్తుగా శ్వాస సమస్య తలెత్తినవారు, బ్లడ్‌లో బాక్టీరియా చేరినవారు, తీవ్రషాక్‌కు గురైనవారిని ప్రత్యేక కొవిడ్‌ ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందించాలని సూచించింది.
  • ప్రస్తుతం ఆక్సిజన్‌ సపోర్ట్‌తో ఉన్న ఓ మోస్తరు కేసులకు అత్యవసర వైద్యం కింద రెమెడిసివిర్‌ ఇవ్వొచ్చని వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. అయితే సాధారణ కంటే 5 రెట్లు అధికంగా ఏఎస్‌టీ, ఏఎల్‌టీ స్థాయి ఉన్న వారికి, మూత్రపిండాలు బలహీనంగా ఉన్నవారు, గర్భణీలు, బాలింతలు, 12 ఏళ్లలోపు పిల్లలకు మాత్రం ఇది ఇవ్వకూడదని పేర్కొంది. ఈ సమస్యలు లేని ఇతరులకు తొలిరోజు 200 మిల్లీగ్రాములు, తర్వాత అయిదురోజులు 100 మిల్లీగ్రాములు రెమెడిసివిర్‌ ఇవ్వొచ్చని సూచించింది.
  • స్టెరాయిడ్స్‌ ఇచ్చినా పరిస్థితులు మెరుగుపడని మోడరేట్‌ కేసుల్లో కాన్వలసెంట్‌ ప్లాస్మాథెరపీని పరిశీలించవచ్చని పేర్కొంది. దీంతో పాటు కీళ్లవాతం రోగులకు ఉపయోగించే తొసిలిజుమాబ్‌ మందునూ పరిశీలించవచ్చని సూచించింది. వీటితోపాటు హైడ్రాక్సీక్లోరోక్విన్‌నూ ఉపయోగించవచ్చని పేర్కొంది.

2 రోజుల ముందు నుంచే ఇబ్బందులు మొదలు

కరోనా లక్షణాలు కనిపించడానికి రెండు రోజుల ముందు నుంచే బాధితుల్లో ఇబ్బందులు మొదలవుతున్నట్లు తాజా సాక్ష్యాధారాలు చెబుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఆ ప్రభావం 8రోజుల వరకు ఉంటుందని పేర్కొంది. మనిషిలో లక్షణాలు కనిపించడానికి సగటున 5.1 రోజులు (2-14 రోజులు) పడుతున్నట్లు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.