ETV Bharat / bharat

భారత్​లోని ఆ 8 బీచ్​లకు 'బ్లూ ఫ్లాగ్' గుర్తింపు - 8 బ్లూ ఫ్లాగ్​ బీచ్​లు

ప్రపంచ పరిశుభ్ర బీచ్​ల జాబితాలో భారత్​కు చెందిన 8 బీచ్​లకు చోటు దక్కింది. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్ ఈ ఘనత దేశానికి గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు.

blue flag_beaches_ind
భారత్​లో 'బ్లూ ఫ్లాగ్' గుర్తింపు పొందిన ఆ 8 బీచ్​లు
author img

By

Published : Oct 11, 2020, 9:36 PM IST

భారత్​కు చెందిన 8 బీచ్​​లు.. 'బ్లూ ఫ్లాగ్' గుర్తింపు పొందడం దేశానికి గర్వకారణమని కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ఈ ఘనత భారత దేశ అభివృద్ధికి నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు.

బ్లూ ఫ్లాగ్​ సర్టిఫికేషన్​ ఇచ్చేదెవరు?

డెన్మార్క్​కు చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశుభ్ర బీచ్​లకు ఈ గుర్తింపు ఇస్తుంది. ఇందుకోసం 33 ప్రమాణాలను పరిశీలిస్తుంది. ఇందులో.. పర్యావరణ విద్య-సమాచారం, స్నానం చేసే నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ-పరిరక్షణ, బీచ్​లలో భద్రత-సేవలు చాలా ముఖ్యమైన ప్రమాణాలుగా పరిగణిస్తుంది.

సెలక్షన్ కమిటీలో ఉన్న ముఖ్యమైన సంస్థలు?

  • యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్​మెంట్ ప్రోగ్రామ్ (యుఎన్​ఈపీ)
  • యునైటెడ్​ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (యుఎన్​డబ్ల్యూటీవో)
  • ఫౌండేషన్​ ఫర్ ఎన్విరాన్​మెంటల్ ఎడ్యుకేషన్, ఎన్​జీవో సంస్థ, డెన్మార్క్
  • ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్)

భారత్​లో ఏ బీచ్​లు గుర్తింపు పొందాయి? అవి ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి?

  1. శివరాజ్​పూర్ బీచ్- గుజరాత్
  2. ఘోఘల- డయ్యు
  3. కసార్​కోడ్- కేరళ
  4. పడుబిద్రి- కర్ణాటక
  5. కప్పడ్- కేరళ
  6. రుషికొండ-ఆంధ్రప్రదేశ్
  7. గోల్డెన్​ బీచ్-ఒడిశా
  8. రాధానగర్-అండమాన్ & నికోబార్

ఒకేసారి 8 బీచ్​ల పేర్లు నమోదవడంలో విశేషం ఏంటి?

ఆసియా- ఫసిఫిక్​ ప్రాంతంలో ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా భారత్​ రికార్డుకెక్కింది.

ఇదీ చదవండి:అరుదైన ఘనత సాధించిన రుషికొండ... బ్లూ ఫ్లాగ్​ బీచ్​గా గుర్తింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.