రామ్గఢ్లో రాంచీ- పాట్నా రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు- కారు ఢీకొని పదిమంది మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. కుజూ పోలీస్స్టేషన్ ప్రాంత పరిధిలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
కారు, ట్రక్కు అతివేగంతో ప్రయాణించడమే ప్రమాదానికి కారణంగా తెలిపారు పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.