ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో నేడు ఐదో విడత పోలింగ్​ - డీడీసీ ఎలక్షన్స్ అప్​డేట్

జమ్ముకశ్మీర్ డీడీసీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఐదో విడత పోలింగ్ జరగనుంది. 8 లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 37 స్థానాలకు 299 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. డీడీసీ ఎన్నికలతో పాటే.. 276 సర్పంచ్​ స్థానాలకు గురువారమే పోలింగ్ జరగనుంది.

5th phase DDC elections
జమ్ము కశ్మీర్ ఎలక్షన్స్ ఐదో విడత
author img

By

Published : Dec 10, 2020, 5:53 AM IST

జమ్ముకశ్మీర్ స్థానిక సంస్థల (డీడీసీ) ఎన్నికలకు గురువారం ఐదో విడత పోలింగ్​ జరగనుంది. మొత్తం 37 స్థానాలకు 299 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8,27,519 ఓటర్లు వీరి భవితవ్యం తేల్చనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 4,33,285 మంది, మహిళా ఓటర్లు 3,94,234 మంది.

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్ జరగనుంది.

కశ్మీర్ డివిజన్​లోని 17 స్థానాలకు 155 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అందులో 30 మంది మహిళలు. జమ్ము డివిజన్​లో 20 డీడీసీ నియోజకవర్గాల్లో 40 మంది మహిళలు సహా 144 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

డీడీసీ ఎన్నికలతో పాటు.. 276 సర్పంచ్​ స్థానాలకు (58 స్థానాల్లో ఉప ఎన్నికలు) గురువారమే పోలింగ్ జరగనుంది.

ఐదో విడద ఎన్నికలకు మొత్తం 2,104 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. అందులో 1,193 అత్యంత సున్నితమైనవిగా, 472 సున్నితమైనవిగా, 439 సాధారణ కేంద్రాలుగా విభజించింది.

ఇదీ చూడండి:డీఆర్​డీఓ ల్యాబ్​ల మధ్య 'క్వాంటమ్' కమ్యూనికేషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.