దేశవ్యాప్తంగా పోలీసు శాఖలో భారీగా ఖాళీలు ఉన్నాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతానికి పోలీసు శాఖలో దేశ వ్యాప్తంగా 5లక్షల 28వేల 396 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు హోంశాఖ అధికారి తెలిపారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 1 లక్ష 29 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 4లక్షల 14వేల 492 పోస్టులున్నాయి. కానీ ప్రస్తుతం 2లక్షల 14వేల 492 మందే విధి నిర్వహణలో ఉన్నారు. నాగాలాండ్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ పోలీసు శాఖలో ఖాళీలున్నాయి.
వివిధ రాష్ట్రాల్లో ఖాళీలు..( 2018, జనవరి 1 వరకు)
రాష్ట్రం | పోస్టులు | ఖాళీలు | |
1 | ఉత్తరప్రదేశ్ | 4,14,492 | 1,28,952 |
2 | బిహార్ | 77,995 | 50,291 |
3 | బంగాల్ | 1,40,904 | 48,981 |
4 | తెలంగాణ | 76,407 | 30,345 |
5 | మహారాష్ట్ర | 2,40,224 | 26,195 |
6 | మధ్యప్రదేశ్ | 1,15,731 | 22,355 |
7 | తమిళనాడు | 1,24,130 | 22,420 |
8 | కర్ణాటక | 1,00,243 | 21,943 |
9 | గుజరాత్ | 1,09,337 | 21,070 |
10 | ఝార్ఖండ్ | 79,950 | 18,931 |
11 | రాజస్థాన్ | 1,06,232 | 18,003 |
12 | ఆంధ్రప్రదేశ్ | 72,176 | 17,933 |
13 | హరియాణ | 61,346 | 16,844 |
14 | ఛత్తీస్‌గఢ్ | 71,606 | 11,916 |
15 | ఒడిశా | 66,973 | 10,322 |
16 | అసోం | 65,987 | 11,452 |
17 | జమ్ముకశ్మీర్ | 87,882 | 10,044 |
* నాగాలాండ్‌లో ఉన్న పోస్టుల (21,292) కన్నా 941 మంది పోలీసులు ఎక్కువగా ఉన్నారు.
ఇన్ని ఖాళీలు ఎలా?
నియామక ప్రక్రియలో మందగమనం, పదవీవిరమణ, అకాల మరణాల వల్లే ఇన్ని ఖాళీలున్నట్లు హోంశాఖ స్పష్టం చేసింది. దేశంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని నిపుణులు అంటున్నారు. ఈ ఖాళీలను పూరిస్తే ఆ సమస్యను కొంతమేరకు అధిగమించవచ్చని యువత కోరుకుంటున్నారు.
ఇదీ చూడండి: 14 అడుగుల నాగుపామును చూసి జనం షాక్