ETV Bharat / bharat

సోమాలియా కంపెనీ చెరలో భారతీయ కార్మికులు - కార్యకర్త రాజేష్ మని

సోమాలియాలోని ఓ కంపెనీ చెరలో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కెన్యాలోని భారత హైకమిషన్​ వెల్లడించింది. ఈ మేరకు అక్కడి ప్రభుత్వంతో సంప్రతింపులు జరుపుతున్నామని తెలిపింది.

33 Indian labourers held 'hostage' by Somalian company; High Commission trying to resolve crisis
సోమాలియాలో భారతీయుల అవస్థలు..స్పందించిన హైకమిషన్
author img

By

Published : Oct 23, 2020, 5:06 AM IST

ఉద్యోగరీత్యా సోమాలియాకు వెళ్లిన 33 భారతీయులను అక్కడి కంపెనీ నిర్భందంలో ఉంచింది. వారిని తిరిగి భారత్​కు తీసుకురావడానికి సర్వదా ప్రయత్నిస్తున్నామని కెన్యాలోని భారత హైకమిషన్​ తెలిపింది. అందుకుగాను సోమాలియా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. వీలైనంత త్వరలో వారిని భారత్​కు తీసుకుని వస్తామని ప్రకటించింది.

కంపెనీ చెరలో చిక్కుకున్న 33 మందిలో 25 మంది ఉత్తర్​ప్రదేశ్​కు, ఆరుగురు బిహార్​కు, పంజాబ్​, హిమాచల్​ ప్రదేశ్​కు చెందిన వారు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సోమాలియా విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడుతున్నాం. వీలైనంత త్వరగా వారిని భారత్​కు తీసుకువస్తాం. వారికి కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్నాం. అధికారులు మాకు భరోసా ఇచ్చారు.

-భారత్​ హైకమిషన్​

అసలేం జరిగింది..?

పొట్ట చేత పట్టుకొని కూలి కోసం సోమాలియాకు వెళ్లిన భారతీయుల బృందాన్ని అక్కడి కంపెనీ బందీలుగా చేసింది. మొదటి రెండు నెలలు మంచిగా చూసుకొంది. జీతం కూడా ఇచ్చింది. తరువాత వారి నుంచి పాస్​పోర్టు తీసుకొని ఎనిమిది నెలలుగా ఒక్కరూపాయి జీతం ఇవ్వకుండా వేధిస్తోంది. జీతం అడిగిన వారిని కాల్చి చంపుతాం అని బెదిరిస్తున్నారు.

ఎలా బయటపడింది..?

అదే కంపెనీలో పని చేస్తున్న కార్మికుడు ఈ మధ్యనే భారత్​కు తిరిగి వచ్చాడు. అక్కడి వారి బాధలను వీడియోలో చిత్రీకరించి మానవ సేవా సంస్థాన్​ అనే ఎన్​జీవోకు చూపించాడు. దీంతో రాజేశ్​కుమార్​ అనే ఎన్​జీవోకు చెందిన వ్యక్తి భారత హైకమిషన్​, విదేశాంగ శాఖను మెయిల్​, ట్విట్టర్​ ద్వారా సంప్రదించారు. వారి దుస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన హైకమిషన్​ తిరిగి ఇండియాకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

పస్తులు ఉంటూ...

'గత 15రోజులుగా భారతీయ కార్మికులకు అన్నం,నీళ్లు ఇవ్వడం లేదు. అనారోగ్య సమస్యలతో బాధ పడేవారికి మందులు కూడా ఇవ్వడంలేదు. పాస్​పోర్టు అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని' రాజేశ్​కుమార్ తెలిపారు.

ఇదీ చూడండి: 3,800 సార్లు కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.