ETV Bharat / bharat

'అతివేగం వల్ల గతేడాది 3.19 లక్షల రోడ్డు ప్రమాదాలు' - Govt to develop model highway stretches

2019 సంవత్సరంలో 4.49 లక్షల రోడ్డు ప్రమాదాలు జరిగాయని రాజ్యసభకు శనివారం తెలిపింది కేంద్రం. ఇందులో 71 శాతం యాక్సిడెంట్లకు అతివేగమే కారణమని స్పష్టం చేసింది.

3.19 lakh road accidents in 2019 due to overspeeding : Govt
'అతివేగం వల్లే గతేడాది 3.19 లక్షల రోడ్డు ప్రమాదాలు'
author img

By

Published : Sep 19, 2020, 6:10 PM IST

అతివేగం రహదారులపై నెత్తుటేరులు పారిస్తోంది. ఏటా వేల ప్రాణాలను బలి తీసుకుంటోంది. గతేడాది దేశవ్యాప్తంగా 4.49 లక్షలకుపైగా రోడ్డు ప్రమాదాలు జరిగాయట. 2019కి సంబంధించి రోడ్డు ప్రమాదాల సమాచారాన్ని రాజ్యసభకు తెలిపిన కేంద్రం.. ఈ మేరకు వివరాలు వెల్లడించింది.

మొత్తం 2019లో 4 లక్షల 49 వేల 2 రోడ్డు ప్రమాదాలు జరిగాయని, ఇందులో 71 శాతం( 3,19,028) యాక్సిడెంట్లకు అతివేగమే కారణమని స్పష్టం చేశారు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు.. పార్లమెంటు సభ్యులతో ప్రతి జిల్లాలోనూ రోడ్డు భద్రత కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

'జాతీయ రహదారులను విస్తరిస్తాం'

జాతీయ రహదారుల అభివృద్ధిలో పూర్తి పరిపక్వత కోసం.. బహుముఖ వ్యూహాన్ని రూపొందించినట్లు తెలిపింది కేంద్రం. ఆధునిక మౌలిక సదుపాయాలతో.. అన్ని సాంకేతిక పరిమితులను పరిగణనలోకి తీసుకొని రహదారులను విస్తరించే యోచనలో ఉన్నట్లు స్పష్టం చేశారు వీకే సింగ్​.

ప్రపంచంలోనే అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే దేశాల్లో భారత్ ముందువరుసలో ఉంది. సంవత్సరానికి సగటున దేశంలో.. 5 లక్షల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వీటిల్లో 1.5 లక్షల మంది చనిపోతున్నారు. మరో 3 లక్షల మంది వైకల్యం బారినపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.