ETV Bharat / bharat

'25శాతం ఆరోగ్య సిబ్బందిలో యాంటీబాడీలు' - యాంటీబాడీలు

దేశంలోని 25శాతం ఆరోగ్య సిబ్బందిలో కొవిడ్​-19 సెరోపాజిటివిటీ (యాంటీబాడీల వృద్ధి) ఉన్నట్లు ఐసీఎంఆర్ నిర్వహించిన సర్వేలో తేలిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయక మంత్రి అశ్విని చౌబే తెలిపారు. సాధారణ ప్రజలతో పోల్చుకుంటే ఎక్కువ శాతం వైద్యసిబ్బందిలో యాంటీబాడీలు గుర్తించామని ఐసీఎంఆర్ తెలిపిందని వివరించారు.

25 percent of healthcare workers in india gained antibodies after vaccination
'25శాతం ఆరోగ్య సిబ్బందిలో యాంటీబాడీలు'
author img

By

Published : Feb 10, 2021, 6:16 AM IST

దేశవ్యాప్తంగా ఉన్న 25శాతం ఆరోగ్య సిబ్బందిలో కొవిడ్‌-19 సెరోపాజిటివిటీ (యాంటీబాడీల వృద్ధి) ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయక మంత్రి అశ్విని చౌబే తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ ఎంతమంది ఆరోగ్యసిబ్బంది కరోనా బారిన పడ్డారని విపక్ష సభ్యులు ప్రశ్నించారు.

కరోనా దేశవ్యాప్తంగా ప్రభావం చూపటం వల్ల విడిగా ఆరోగ్య కార్యకర్తల వివరాలు ప్రభుత్వం సేకరించలేదు. కానీ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్) చేసిన మూడో విడత సెరో సర్వేలో (డిసెంబరు 2020 నుంచి జనవరి 2021 మధ్యలో చేసిన సెరో సర్వే) 25.7శాతం ఆరోగ్య సిబ్బందిలో యాంటీబాడీలు గుర్తించినట్లు వెల్లడించారు.

---- అశ్విని చౌబే, కేంద్ర ఆరోగ్య శాఖ సహాయక మంత్రి

సెరో సర్వే లేదా సెరోప్రివిలెన్స్‌ అనేవి రక్త పరీక్ష ద్వారా శరీరంలోని యాంటీబాడీలను గుర్తించే విధానం. కరోనా ప్రారంభం నుంచి ఐసీఎంఆర్‌ భారత్‌లో వివిధ దశల్లో సెరో సర్వేలు నిర్వహించింది. ఐసీఎంఆర్‌ నిర్వహించిన మూడో దశ సర్వేలో భారత్‌లో మొత్తం 21శాతం మంది ప్రజల్లో యాంటీబాడీలు గుర్తించినట్లు పేర్కొన్నారు. సాధారణ ప్రజలతో పోల్చుకుంటే ఎక్కువ శాతం వైద్యసిబ్బందిలో యాంటీబాడీలు గుర్తించిందని తెలిపారు.

కరోనా కాలంలో అవిశ్రాంత సేవలనందిస్తున్న 22 లక్షలకు పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య సిబ్బందికి ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ ప్యాకేజీ కింద 50లక్షల ప్రమాద బీమాను కల్పించామని మంత్రి మరో ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

ఇదీ చదవండి : దేశంలో 65.28 లక్షల మందికి వ్యాక్సినేషన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.