మలయాళ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 17న వారికి నూతన సంవత్సరం ప్రారంభమైంది. మొదటి నెల చింగం మాసం వారి జీవితాలకూ శుభారంభంగా భావిస్తారు మలయాళీలు. ఈ నెలలో శుభ ముహూర్తాన మూడు ముళ్లు వేస్తే దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని ఇక్కడివారి నమ్మిక .
ఆదివారం మంచి ముహూర్తాన్ని మిస్ కాకూడదని, గుడి తెరవకముందే మూడు కళ్యాణ మండపాల్లో జనాలు నిండిపోయారు. ఆ ప్రాంగణమంతా పెళ్లి బాజాలతో మారుమోగింది. ఒక్కరోజునే గురువాయూర్ గుడిలో 186 జంటలు ఒక్కటయ్యాయి. 689 మంది చిన్నారులకు 'చోరునూ'... అంటే అన్నప్రాసన జరిపించారు.
దాదాపు వెయ్యి వేడుకలు జరుగుతున్నప్పుడు వారి కుటుంబ సభ్యులు, బంధువుల సంఖ్య ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇక వారి వాహనాల వల్ల ఏర్పడ్డ ట్రాఫిక్ ఇక్కట్లు అన్నీఇన్నీ కావు.
ఇదీ చూడండి:సీఎం కాన్వాయ్‌ని బైక్‌తో ఢీకొట్టిన యువకుడు