ETV Bharat / bharat

పబ్​జీ ఆడుతూ గుండెపోటుతో బాలుడు మృతి - పబ్​జీ ఆటలో యువకుడు మృతి

తమిళనాడు ఈరోడ్​ పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. ఆన్​లైన్​ గేమ్.. పబ్​జీ ఆడుతూ 16 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఇంటిలో నేలమీద పడిపోయిన బాలుడ్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

16-year-old dies of cardiac arrest while playing PUBG in Tamil Nadu
పబ్​జీ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి
author img

By

Published : May 20, 2020, 2:25 PM IST

Updated : May 20, 2020, 3:30 PM IST

తమిళనాడులో ఈరోడ్​ పట్టణంలో దారుణం జరిగింది. 16 ఏళ్ల సతీశ్​ కుమార్​ ఆన్​లైన్​ గేమ్​ పబ్​జీ ఆడుతూ గుండెపోటుతో మరణించాడు. మధ్యాహ్నం భోజనం చేశాక ఆటను మొదలు పెట్టి సుమారు ఆరు గంటలు అదే పనిగా ఆడి ఒక్కసారిగా నేలపై కుప్పకూలిపోయాడని కుటుంబసభ్యులు తెలిపారు. హుటాహుటిన దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

ఇతర ఆటగాళ్ల అరుపుల కారణంగా సతీశ్​ ఉద్రేకానికి గురయ్యాడని.. అందుకే గుండెపోటు వచ్చిందని ఆరోపిస్తున్నారు బాలుడి తల్లిదండ్రులు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: టీబీ డయాగ్నోస్టిక్ యంత్రాలతో కరోనా పరీక్షలు

Last Updated : May 20, 2020, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.