ETV Bharat / bharat

ఐదోశతాబ్దం నాటి అరుదైన శ్రీరాముడి విగ్రహం

అలహాబాద్​ మ్యూజియంలో అతి పురాతనమైన శ్రీరాముడి విగ్రహాన్ని భద్రపరిచారు అధికారులు. శృంగావర్​పుర్​లోని తవ్వకాల్లో ఈ విగ్రహం బయటపడగా.. అది 1500 ఏళ్ల క్రితం నాటిదని అంచనా వేస్తున్నారు.

1500 year old lord ram statue is in allahabad museum
ఐదోశతాబ్దం నాటి అరుదైన శ్రీరాముడి విగ్రహం.
author img

By

Published : Nov 18, 2020, 7:44 PM IST

అరుదైన శిల్పకళకు సాక్ష్యంగా నిలిచింది అలహాబాద్​ మ్యూజియం. 1500 ఏళ్లనాటి సీత, లక్ష్మణ సమేత శ్రీరాముని విగ్రహాన్ని ఇక్కడ భద్రపరిచారు పురావస్తుశాఖ అధికారులు. రావణ వధ అనంతరం అయోధ్యకు విచ్చేసిన సందర్భాన్ని ఈ విగ్రహం గుర్తు చేస్తోందని అధికారులు చెబుతున్నారు.

ఐదోశతాబ్దం నాటి అరుదైన శ్రీరాముడి విగ్రహం.

శృంగావర్​పుర్​లో జరిపిన తవ్వకాల్లో ఈ విగ్రహం బయటపడింది. కార్బన్​ డేటింగ్​ ఆధారంగా ఈ విగ్రహాన్ని.. గుప్తుల కాలానికి చెందినట్లుగా అధికారులు అంచనా వేశారు. లక్ష్మణ, సీతా సమేతంగా అభయముద్రలో శ్రీరాముడు ఉన్నాడు. ఆంజనేయుడు కూడా అభయముద్రలోనే ఉన్నాడు.

"రావణ వధ అనంతరం అయోధ్యలో రాముడు అడుగుపెట్టినట్లుగా ఈ శిల్పంలో ఆధారాలు ఉన్నాయి. పువ్వులు, దీపాలు, రంగోలీలతో విగ్రహం అలంకరించి ఉంది. అందరిముఖాలు సంతోషంతో నిండి ఉన్నాయి. అభయముద్రలో శ్రీరాముడు, ఆంజనేయుడి విగ్రహాలు చెక్కిఉన్నాయి. వీటి ఆధారంగా లంకపై విజయం సాధించిన తర్వాత అయోధ్యకు చేరుకున్న సందర్భంలోనిదని మేం భావిస్తున్నాం"

-- అలహాబాద్​ మ్యూజియం డైరెక్టర్​, సునీల్​ గుప్తా.

ఇదీ చూడండి:ఉత్తర భారతంలో వైభవంగా 'ఛఠ్​ పూజ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.