కరోనా వ్యాప్తి ప్రారంభమయ్యాక గత 2 నెలల్లో 15 లక్షల మంది విదేశాల నుంచి భారత్కు వచ్చారని వెల్లడించారు కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ. అయితే వారిపై పర్యవేక్షణ విషయంలో పొరపాటు జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
కరోనా అనుమానితుల పర్యవేక్షణకు సంబంధించి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యకార్యదర్శులకు లేఖలు రాశారు రాజీవ్. స్థానిక అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తున్న అనుమానితుల సంఖ్యకు, గత 2 నెలల్లో విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్యకు ఏమాత్రం పొంతన లేదని లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి లోపాలతో కరోనా కట్టడికి చేస్తున్న ప్రయత్నాలు నీరుగారే ప్రమాదముందని హెచ్చరించారు.
భారత్లో ఇప్పటివరకు కరోనా సోకినట్లు తేలినవారిలో అత్యధికులు విదేశాల నుంచి వచ్చినవారే. ఈ నేపథ్యంలో పొరుగు దేశాల నుంచి వారిపై పర్యవేక్షణకు సంబంధించి ఈ లేఖ రాశారు రాజీవ్.
ఇదీ చూడండి: లాక్డౌన్తో నిర్మానుష్యంగా దేశ రాజధాని