ETV Bharat / bharat

రెండు రాష్ట్రాల్లో పిడుగులు పడి 28 మంది మృతి - పిడుగులు పడి 15 మంది మృతి

బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల కారణంగా పిడుగులు పడి మంగళవారం 28 మంది మృతి చెందారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు.

15 killed in Bihar lightning strikes; CM announces Rs 4 lakh as ex-gratia to victims' kin
బిహార్​లో పిడుగులు పడి 15 మంది మృతి
author img

By

Published : Sep 15, 2020, 9:57 PM IST

Updated : Sep 15, 2020, 11:02 PM IST

దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వానల కారణంగా బిహార్​, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాల్లో పిడుగులు పడి 28 మంది మృతి చెందారు.

బిహార్​లో 15 మంది...

బిహార్​లో భారీ వర్షాల కారణంగా కారణంగా రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో పిడుగులు పడ్డాయి. ఈ ఘటనల్లో 15 మంది మృతి చెందారు.

గోపాల్​గంజ్​, భోజ్​పుర్​, రోహ్​తాస్​ జిల్లాల్లో ముగ్గురి చొప్పున.. అలాగే సరన్​, కైమూర్​, వైశాలి జిల్లాల్లో ఇద్దరి చొప్పున మరణించారు.

మృతులకు సంతాపం తెలిపిన బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​.. ఒక్కొక్క కుటుంబానికి రూ.4 లక్షలు పరిహారంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.

ఈ ఏడాది పిడుగుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 330 మంది మృతి చెందారు.

యూపీలో 13 మంది మృతి...

ఉత్తర్​ప్రదేశ్​లో కూడా పిడుగులు పడి మంగళవారం 13 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. ఖాజీపూర్‌లో నలుగురు, కౌశాంబిలో ముగ్గురు, ఖుషీనగర్, చిత్రకూట్‌లో ఇద్దరు, జౌన్‌పూర్, చందౌలిలో ఒకరి చొప్పున మరణించారని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి 'దేశంలోని రెండు కరోనా వ్యాక్సిన్లు అత్యంత సురక్షితం'

Last Updated : Sep 15, 2020, 11:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.