సాగు చట్టాలకు వ్యతిరేకంగా శుక్రవారం నిర్వహించే భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని రైతు సంఘాలు ప్రజలకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా మార్చి 26వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ పాటించాలని సూచించాయి.
రైలు, రోడ్డు రవాణా సహా మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాలను మూసి వేయాలని కోరిన రైతు సంఘాలు.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బంద్ పాటించాల్సిన అవసరం లేదని వెల్లడించాయి. అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలకూ బంద్ నుంచి మినహాయింపు కల్పించారు.
" రైళ్ల రాకపోకలతో పాటు.. రోడ్డు రవాణాను అడ్డుకుంటాం. కార్మిక, రవాణా, ఇతర సంఘాలు ఈ బంద్‌కు మద్దతు ప్రకటించాయి."
- బల్బీర్ సింగ్ రాజేవాల్, రైతు నేత
కేంద్రం తెచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నాలుగు నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.
ఇదీ చదవండి: 'రైతు ఉద్యమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేదిలేదు'