ETV Bharat / bharat

జనవరిలో ఈ టూర్ వెళ్తే - మీ బ్యాగు నిండా మెమొరీస్​ మోసుకొస్తారు! - North India Tour

Best Tourism Spot Himachal Pradesh : ఎన్ని పనులు ఉన్నా సరే.. కనీసం ఏడాదికి ఓసారైనా టూర్ వేయాల్సిందే. మీరు ప్లాన్ చేస్తున్నారా? "అనుకుంటున్నాం.. చూడాలి" అంటారా? ఆ చూసేదేదో ఈ నెలలోనే చూడండి! అవును.. జనవరిలో మీరు తప్పక చూడాల్సిన ఓ పర్యాటక ప్రాంతం గురించి చెప్పబోతున్నాం. అక్కడికిగానీ వెళ్లారంటే.. "మంచు కురిసే వేళలో.." అని మైమరచి పాడుకోవడమే..!

Best Tourism Spot Himachal Pradesh
Best Tourism Spot Himachal Pradesh
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 4, 2024, 2:22 PM IST

Best Tourism Spot Himachal Pradesh : కొత్త సంవత్సరానికి జనం గ్రాండ్​గా వెల్కమ్ చెప్పారు. మళ్లీ ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. అయితే.. జీవితమంతా డ్యూటీలోనే కాలం గడిపేయడం మంచిది కాదని మానసిక నిపుణులు చెప్తూనే ఉంటారు. దీనివల్ల.. మానసికంగా అలసిపోవడంతోపాటు ప్రొడక్షన్ క్వాలిటీ కూడా తగ్గిపోతుందని అంటారు. అందుకే.. అప్పుడప్పుడూ "చిల్" అవ్వాలని... ఆర్నెల్లకు ఒకసారి, కుదరకపోతే ఏడాదికి ఒకసారైనా టూర్​కు వెళ్లి రావాలని సూచిస్తుంటారు. దీనివల్ల.. ఫుల్ రీఛార్జ్​ అవుతారని, మెంటల్లీ స్ట్రాంగ్​గా తయారవడంతోపాటు వర్క్​లోనూ యాక్టివ్​ అవుతారని చెబుతుంటారు. అందుకే.. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా టూర్ ప్లాన్ చేయండి. ఎక్కడికి వెళ్లాలో మేం చెప్తాం. అద్భుతమైన మెమొరీస్ బ్యాగుల నిండా నింపుకొని వచ్చేయండి.

ఛలో.. హిమాచల్!

చలి కాలంలో చుట్టి రావడానికి నార్త్​లో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. అందులో.. హిమాచల్ ప్రదేశ్ ఒకటి. అద్దిరిపోయే హిల్ స్టేషన్లకు పెట్టింది పేరు హిమాచల్. దేశం నలు మూలల నుంచి ఇక్కడ వాలిపోయే వారికి కొదవే ఉండదు. లక్షలాదిగా తరలి వస్తారు. అంతలా.. టూరిస్టులను అట్రాక్ట్ చేస్తాయి ఇక్కడి ప్రదేశాలు. సిమ్లా, కులు-మనాలి ధర్మశాల వంటి సుప్రసిద్ధ ప్రదేశాలను ఒక్కసారైనా చూసి తీరాల్సిందే అన్నది టూరిస్టుల మాట. అయితే.. ఈ ఫేమస్ ప్రాంతాలు నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉంటాయి. ఇలా కాకుండా కాస్త ప్రశాంతంగా ప్రకృతిలో గడిపి రావాలని అనుకుంటే.. అలాంటి ప్రాంతాలు కూడా ఇక్కడే ఉన్నాయి.

కసోల్..

హిమాచల్‌ అందాలను కళ్లకు కడుతుంది కసోల్ ప్రాంతం. ఇది స్వర్గానికి కాస్త దూరంలోనే ఉన్న ఫీలింగ్ కలిగిస్తుందంటే నమ్మాల్సిందే. ఇక్కడ ఎంతో అందమైన లోయలు మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయి. సముద్ర మట్టానికి 5 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కసోల్‌.. టూరిస్టులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది. ఇక్కడ పార్టీలను ఆస్వాదించడంతోపాటు, పార్వతి నది, మణికరణ్ హాట్, మలానా, తోష్ విలేజ్, ఖీర్‌గంగా పీక్ వంటి ది బెస్ట్ టూరిస్టు ప్రాంతాలను చూసిరావొచ్చు.

కుఫ్రీ..

సినిమాల్లో మాత్రమే చూసే సుందరమైన ప్రదేశాలను కుఫ్రీలో చూడొచ్చు. సిమ్లా నుంచి దాదాపు 15 కి.మీ దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతానికి తక్కువ మంది సందర్శిస్తారు. కానీ.. జనవరిలో ఇక్కడ మంచు కాస్త ఎక్కువగానే కురుస్తుంది. ఈ సమయంలో మీరు.. యాపిల్ తోటల్లో తిరుగుతూ.. ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేకాదు.. ఇక్కడ కొన్ని అడ్వెంచర్స్ కూడా చేసే వీలుంది.

చైల్..

సోలన్ జిల్లాలో ఉన్న ఒక చిన్న ప్రాంతం ఇది. కానీ.. ఎంతో బ్యూటీ ఫుల్​గా ఉంటుంది. ఈ హిల్ స్టేషన్ పర్యాటకుల మనసు దోచేస్తుంది. ఇక్కడ కూడా రద్దీ తక్కువగా ఉంటుంది. ఇక్కడి ఎత్తైన పర్వతాలు, దేవదారు వృక్షాలు, దట్టమైన అడవులు, సరస్సులు, జలపాతాలు చైల్ ప్రాంతాన్ని సుందర ప్రదేశంగా మార్చేశాయి. ఇక్కడి పర్వతాల మధ్యలో మంటలు వెలిగించి.. ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయొచ్చు. చైల్ ప్యాలెస్, చైల్ అభయారణ్యం, కాలీ కా టిబ్బా వంటివి ది బెస్ట్ ప్రాంతాలుగా నిలుస్తాయి.

మూరాంగ్..

కిన్నౌర్ నుండి కొద్ది దూరంలో ఉన్న హిమాలయాల్లోని.. అత్యద్భుతమైన లోయల్లో మూరాంగ్ ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం అందం జనవరిలో పీక్​ స్టేజ్​కు చేరుతుంది. ఈ నెలలో ఎక్కడ చూసినా మంచు అద్భుతంగా కనిపిస్తుంది. మీరు చిన్న పిల్లలుగా మారిపోయి మంచులో దొర్లేస్తారు. ఇక్కడి లోయల అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. "జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్" అనాల్సిందే.

చెప్తుంటేనే సూపర్​గా ఉంది కదూ! ఇక చూశారంటే మిమ్మల్ని మీరే మైమరచిపోతారు. మరి ఇంకెందుకు ఆలస్యం? పని ఎప్పటికీ ఉండేదే కాబట్టి.. టూర్​ ఫిక్స్ చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.