ETV Bharat / bharat

'బెంగళూరు టెక్​ సదస్సు'ను ప్రారంభించనున్న మోదీ

author img

By

Published : Nov 19, 2020, 5:03 AM IST

కర్ణాటక ప్రభుత్వం నిర్వహిస్తున్న 'బెంగ‌ళూరు టెక్ సదస్సు-2020'ను ప్రధాని నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా గురువారం ప్రారంభించనున్నారు. మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సులో కరోనా అనంతరం మానవాళికి ఎదురయ్యే సవాళ్లు, ఐటీ, బయోటెక్నాలజీ తదితర అంశాలపై చర్చించనున్నారు.

bengaluru tech summit 2020 will be inaugurated by pm modi
'బెంగళూరు టెక్​ సదస్సు-2020'ను ప్రారంభించనున్న ప్రధాని

'బెంగళూరు టెక్​ సదస్సు-2020'ను ప్రధాని నరేంద్రమోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సదస్సును కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక ఇన్నోవేషన్​ టెక్నాలజీ సొసైటీ, రాష్ట్ర విజన్​ గ్రూప్​ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ నెల 19 నుంచి 21 వ‌ర‌కు ఈ సదస్సు జ‌రగ‌నుంది. ఈసారి సదస్సుకు 'నెక్స్ట్​ ఈజ్ నౌ’ అనే థీమ్​ను ఎంచుకున్నారు. కరోనా అనంతరం మానవాళికి ఎదురయ్యే సవాళ్లు.. ఐటీ, బయోటెక్నాలజీ తదితర అంశాలపై ఇందులో చర్చించనున్నారు.

ఈ సదస్సులో ఆస్ట్రేలియా ప్ర‌ధాని స్కాట్ మారిస‌న్‌, స్విజర్లాండ్​ ఉపాధ్య‌క్షుడు గైప‌ర్మెలిన్​తో పాటు, అంత‌ర్జాతీయ స్థాయి ప్ర‌ముఖలు పాల్గొననున్నారు. వీరితో పాటు, దేశ విదేశాల్లోని పారిశ్రామిక ప్రముఖులు, టెక్నోక్రాట్స్‌, ప‌రిశోధ‌కులు, విద్యారంగ నిపుణులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.