Omicron Reinfection: ఒమిక్రాన్‌ను జయించిన వైద్యుడికి మళ్లీ కరోనా - బెంగళూరు వైద్యుడికి మళ్లీ కరోనా
Omicron in Karnataka: ఒమిక్రాన్ నుంచి కోలుకున్న బెంగళూరు వైద్యుడికి మళ్లీ కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు తెలిపారు. ఆ వైద్యుడు ఐసోలేషన్‌లో ఉన్నారని.. ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించారు.
Omicron Reinfection: ఒమిక్రాన్‌ను జయించిన బెంగళూరు వైద్యుడికి మళ్లీ కొవిడ్ సోకింది. ఈ విషయాన్ని బృహత్ బెంగళూరు మహానగర పాలికె అధికారులు తెలిపారు. ఆ వైద్యుడు ఐసోలేషన్‌లో ఉన్నారని.. అయితే ఎటువంటి లక్షణాలు లేవని పేర్కొన్నారు.
దేశంలో తొలిసారి ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిన ఇద్దరిలో ఈయన కూడా ఒకరు.
పారిపోయిన వ్యక్తిపై కేసు
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరిని క్వారెంటైన్లో ఉంచగా.. గుజరాత్‌కు చెందిన వ్యక్తి దుబాయ్‌కు పారిపోయాడు. అధికారులకు సమాచారం ఇవ్వకుండా.. క్వారెంటైన్ నిబంధనలు ఉల్లఘించినందుకు అతనిపై పోలీసు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తిని అనుమతించినందుకు ఓ ఫైవ్‌స్టార్ హోటల్ యాజమాన్యం, సిబ్బందిపై కూడా కేసు నమోదు చేశారు.
మరో ఒమిక్రాన్ కేసు!
Omicron in Madhya Pradesh: దేశంలో ఒమిక్రాన్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో.. మధ్యప్రదేశ్‌లో జర్మనీకి చెందిన ఓ వ్యక్తి కరోనా బారిన పడినట్లు నిర్ధరణ అయింది. దీంతో ఆ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు. ఆ వ్యక్తిని స్థానిక ఐసోలేషన్ సెంటర్లో వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు చెప్పారు.
ఆ వ్యక్తి ఆదివారం సాయంత్రం ఓ వివాహ వేడుకకు హాజరయ్యాడని.. ఆయన కాంటాక్ట్ అయిన 50 మంది నమూనాలను సేకరించినట్లు పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, దిల్లీలో ఒమిక్రాన్ కేసులు బయటపడిన నేపథ్యంలో ఈ కేసుతో రాష్ట్ర ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి: పెళ్లయిన కొద్దిగంటలకే నవవధువుపై కాల్పులు