మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో డెలివరీ బాయ్‌ని అరెస్టు చేశారు పోలీసులు. ఈ ఘటన బెంగళూరు కొరమంగలలో జరిగింది.
ఇదీ జరిగింది..
అరుణ్ కుమార్ అనే వ్యక్తి, అతని సోదరుడు డొంజో సంస్థలో డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు. షిఫ్టుల రూపంలో ఓకే ఐడీ కార్డుతో వీరు పనిచేయసాగారు. అయితే.. మే 31న రాత్రి పూట డెలివరీ కోసం వెళ్లిన అరుణ్.. రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఆ చోటు నుంచి పరారయ్యాడు.

బాధితురాలు వెంటనే కొరమంగల పోలీసు స్టేషన్‌కు ఫోన్ చేసి జరిగింది వివరించింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన ప్రాంతంలోని 40 సీసీటీవీ ఫుటేజ్‌లు, 80 బైక్‌ల వివరాలు చెక్ చేసి 48గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు.
మొబైల్ స్టాండ్, బైక్ మిర్రర్ సాయంతో..
సీసీటీవీలోనూ నిందితుడు.. మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన తీరు స్పష్టంగా కనిపించింది. కానీ, అతని ముఖం కనిపంచకపోవడం వల్ల.. పోలీసులు మొబైల్ స్టాండ్, మిర్రర్ ఆధారంగా.. నిందితుడు ఉపయోగించిన హోండా డియో బైక్ అరుణ్ సోదరుడిదని తెలుసుకున్నారు. తొలుత నిందితుడి సోదరుడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అసలు విషయం బయటపడింది. ఈ ఘటనకు పాల్పడింది అరుణ్ అని తెలిసింది. వెంటెనే నిందితుడిని అరెస్టు చేశారు. గతంలోనూ అరుణ్ ఇతర మహిళలతో ఇదే తరహాలో ప్రవర్తించాడని వెల్లడించారు.

ఇదీ చదవండి:మూడు గంటల్లో రూ. 37లక్షలు పోగుచేసి!